ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Hero Sudheer Babu Wishes to Case 30 Team

‘కేస్-30’ టీమ్‌కి అభినందనలు: సుధీర్ బాబు

Hero Sudheer Babu Wishes to Case 30 TeamHero Sudheer Babu Wishes to Case 30 Team

యువ ప్రతిభాశాలి సందీప్ పైడిమర్రి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న వినూత్న కథాచిత్రం ‘కేస్-30’. మర్డర్ మిస్టరీ నేపద్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో.. సిద్ధార్ద్ నాయుడు, శ్వేతా గర్గ్, తేజస్విని రావెళ్ల, ‘రంగస్థలం’ మహేష్ ముఖ్య తారాగణం. పి.ఎన్. ఆర్.ఫిల్మ్ ఫ్యాక్టరీ-యువసాయి క్రియేషన్స్ బ్యానర్స్ పై... పి.నరసింహారావు-బోడా రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం టీమ్ ప్రముఖ యువ కథానాయకుడు సుధీర్ బాబును కలిసి ఆయన అభినందనలు అందుకుంది. మంచి కాన్సెప్ట్-మంచి టీమ్ తో తెరకెక్కుతున్న ‘కేస్-30’ కచ్చితంగా మంచి విజయం సాధించాలని సుధీర్ బాబు ఆకాక్షించారు. 

ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని, లాక్ డౌన్ కారణంగా ఆగిన ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే.. ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్లీ మొదలు కానుంది. తమను తాము ప్రూవ్ చేసుకోవాలన్న తపన కలిగిన టీమ్ తో రూపొందుతున్న ‘కేస్-30’ అందరికీ చాలా మంచి పేరు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన డెబ్యూ డైరెక్టర్ సందీప్ పైడిమర్రి.. నిర్మాతలు పి.నరసింహారావు-బోడా రాధాకృష్ణలకు కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ చిత్రానికి కథ: సిద్ధార్ద్ నాయుడు, సినిమాటోగ్రఫీ: గౌతమ్ బండ్రెడ్డి, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, మాటలు: భరత్ పచ్చా, పాటలు: శశికుమార్ సాకే, సంగీతం: జెరోమ్ ఎస్.వి, నిర్మాతలు: పి.నరసింహారావు-బోడా రాధాకృష్ణ, స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సందీప్ పైడిమర్రి.

Case 30 Team ready to Shooting

case 30 movie
sudheer babu
tollywood
shootings
sandeep paidimarri
siddharth naidu
O.M Review
O.M Review
26 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
26 Nov 2026
DNK Review
DNK Review
26 Nov 2026
GOAT Review
GOAT Review
26 Nov 2026
Scene Review
Scene Review
26 Nov 2026
Ramayana Review
Ramayana Review
26 Nov 2026