ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు పెట్టిన హీరోయిన్?

Meera Chopra Complains Cyber Crime on NTR Fans

Wed 03rd Jun 2020 05:51 PM
Advertisement
meera chopra,complains,cyber crime,ntr fans,abuse comments  ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు పెట్టిన హీరోయిన్?
Meera Chopra Complains Cyber Crime on NTR Fans ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు పెట్టిన హీరోయిన్?
Advertisement

ఒక హీరోని ఎవరైనా అభిమానిస్తున్నారు అంటే .. ఆ హీరో కోసం ప్రాణాలను సైతం లెక్కచేయరు. అంత అభిమానిస్తారు. అభిమానులకు కోపమొచ్చినా, ఆనందం వేసినా అది సోషల్ మీడియాలోనే చూపిస్తారు. అలాగే రచ్చకెక్కి రచ్చ చేస్తారు. తాజాగా ఓ హీరోయిన్ కి ఎన్టీఆర్ అభిమానులు చుక్కలు చూపెట్టారు. ఆమె ఎవరో కాదు... ఒకప్పుడు హీరోయిన్ గా చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న మీరా చాప్రా. ఆమె అభిమానులతో చిట్ చాట్ చేస్తుండగా ఓ అభిమాని స్టార్ హీరో ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి అని అడగగా.. ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియదు.. ఎందుకంటే నేను ఎన్టీఆర్ అభిమానిని కాదు. నేను ఆయనని అభిమానించడం లేదు అనగానే ఆ నెటిజెన్ కి విపరీతమైన కోపం వచ్చింది. ఆమె చెప్పిన ఆన్సర్ కి ఎన్టీఆర్ అభిమానులకు వచ్చిన కోపానికి మీరా చోప్రాని అనరాని మాటల్తో వేధించడం స్టార్ట్ చేసారు.

అలాగే సోషల్ మీడియా వేదికగా మీరా చోప్రా ని బెదిరించడంతో మీరా చోప్రా కాస్త కంగారుపడి.. సైబర్ క్రైమ్ పోలీస్ లను ఆశ్రయించి కేసు పెట్టింది. కొందరు నన్ను సోషల్ మీడియాలో వేధిస్తున్నారని, అసభ్య  పదజాలంతో బూతులు తిడుతున్నారని... వారిపై చట్టపరమైన చర్యలు తీస్కోవాలని... తనని తిట్టినా వారు, వేధిస్తున్నవారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని ఆమె పోలీస్ లకి ఫిర్యాదు చేసింది. తనని సోషల్ మీడియాలో ట్వీట్స్ తో ఎలా వేధించారో మీరా స్క్రీన్ షాట్స్ తో సహా పోలీసులకు ఆధారాలను అందించింది. తనని వేధించిన వారి ట్విట్టర్ ఖాతాదారులందరి మీద కేసు వేస్తున్నాను.. నన్ను చంపుతామని, గ్యాంగ్ రేప్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని మీరా పోలీస్‌లకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

Advertisement

Meera Chopra Complains Cyber Crime on NTR Fans:

Meera Chopra Complains to Cyber Crime on NTR Fans Abuses

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement