Advertisementt

అందం ఆకాశమంత.. అవకాశాలు ఆవగింజంత..

Tue 02nd Jun 2020 04:07 PM
tejaswi,telugu,telugu film industry,tollywood  అందం ఆకాశమంత.. అవకాశాలు ఆవగింజంత..
Tejaswi raises heat with her photos.. అందం ఆకాశమంత.. అవకాశాలు ఆవగింజంత..
Advertisement
Ads by CJ

తెలుగులో తెలుగందాలు చాలా ఉన్నా ఎక్కడెక్కడి నుండో హీరోయిన్లని ఎందుకు దిగుమతి చేసుకుంటారో అర్థం కాదు. తెలుగు హీరోయిన్లు చాలా మంది ఉన్నా కూడా అవకాశాలు ఎందుకు రావో అంతుచిక్కని ప్రశ్న. మరీ ముఖ్యంగా కొందరు తెలుగమ్మాయిలని చూస్తుంటే ఈ అనుమానం అందరికీ కలుగుతుంది. అందులో మొదటగా వచ్చే పేరు తేజస్వి మదివాడ. తేజస్వి తన కెరీర్లో చాలా సినిమాల్లోనే కనిపించింది. 

హీరోయిన్ గానూ ఒకట్రెండు సినిమాల్లో కనిపించినా సరైన గుర్తింపు రాలేదు. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే తేజస్వి హాట్ హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోతుంది. దీంతో ఈమెకి సోషల్ మీడియాలో ఫాలోవర్లు విపరీతంగా పెరుగుతున్నారు. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. కోటు మాత్రమే వేసుకుని, హాట్ అందాలని ప్రదర్శిస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది.

హార్ట్ అటాక్ సినిమాలో చిన్నపిల్లగా కనిపించిన ఈ అమ్మాయేనా అని ఆశ్చర్యపోయేంతలా అందాల విందు అందిస్తోంది. మత్తెక్కించే కళ్ళతో మైమరిపించే అందాలతో మెస్మరైజ్ చేసేస్తుంది. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా తన అందాలకి ఏమాత్రం లాక్ వేయకుండా ఫాలోయింగ్ ని పెంచుకుంటూ వెళ్తుంది. ఫోటోషూట్లతో హీట్ పెంచేస్తున్న ఈ భామకి సరైన గుర్తింపు ఎప్పుడు వస్తుందో చూడాలి.

Tejaswi raises heat with her photos..:

Tejaswi raises heat with her photos

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ