మంచు మనోజ్ ధైర్యంగా అడిగేశాడు!

Tue 26th May 2020 11:55 AM
manchu manoj,ttd lands,ap government,question,hero manchu manoj  మంచు మనోజ్ ధైర్యంగా అడిగేశాడు!
Manchu Manoj Open letter on TTD lands మంచు మనోజ్ ధైర్యంగా అడిగేశాడు!
Sponsored links

‘‘ఓం న‌మో వేంక‌టేశాయ‌

టీటీడీ ఆస్తులు అమ్మ‌మ‌ని దేవుడేమ‌న్నా చెప్పాడా?

క‌రోనా సంక్షోభంలో రోజుకు ల‌క్ష మందికి ఆక‌లి తీర్చ‌మ‌ని కూడా దేవుడు ఏమ‌న్నా చెప్పాడా?

చేసేది, చెప్పేది అంతా టీటీడీ పాల‌క మండ‌లి.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఆస్తుల‌ను, కొండ‌కి వ‌చ్చిన ల‌క్ష‌లాది మందిని, సుప్ర‌భాత సేవ‌కి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి.. అని శ్రీ‌హ‌రిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాల‌క మండ‌లి.

కొండ‌పైన ఉన్న వ‌డ్డీ కాసుల‌వాడి ఆస్తులు అమ్మ‌కానికి వ‌చ్చాయి అంటే ‘‘గోవిందా గోవిందా’’ అని అర‌చిన ఈ గొంతు కొంచెం త‌డ‌బ‌డింది.

మోసం జ‌ర‌గ‌ట్లేదు అని తెలుసు. ఎందుకంటే ఇన్‌సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా వేలం వేసి అంద‌రి ముందూ అంద‌రు చూస్తుండ‌గానే అమ్మ‌కం జ‌రుపుతారు.

కానీ, ఎందుకు అమ్ముతున్నారు?.. అని పాల‌క మండ‌లిని కాస్త వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వివ‌ర‌ణ మాత్ర‌మే.

ఏమీ లేదు సార్‌.

ఇంత పెద్ద కొండ మాకు అండ‌గా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుప‌తి వాడిని కాబ‌ట్టి ఆపుకోలేక అడుగుతున్నా సార్‌.. అంతే. జై హింద్‌..

 

మీ 

మ‌నోజ్ మంచు’’

Sponsored links

Manchu Manoj Open letter on TTD lands:

Manchu Manoj Question to AP Government

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019