నితిన్ కి హీరోయిన్ ని వెతికే పనిలో దర్శకుడు..

Mon 25th May 2020 11:37 AM
nithin,merlapaka gandhi,andhadhun,ayushman khurana,tabu  నితిన్ కి హీరోయిన్ ని వెతికే పనిలో దర్శకుడు..
Director searching for heroine.. నితిన్ కి హీరోయిన్ ని వెతికే పనిలో దర్శకుడు..
Sponsored links

భీష్మ సినిమాతో మంచి విజయం అందుకున్న నితిన్, బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధాధున్ తెలుగు రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన అంధాధున్ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా చేశాడు. ఈ సినిమాలోని ఆయన నటనకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది. మరి అలాంటి పాత్రలో నితిన్ నటిస్తున్నాడంటే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అందరికీ తెలిసిందే.

నాని హీరోగా క్రిష్ణార్జున యుద్ధం సినిమాకి దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ అంధాధున్ తెలుగు రీమేక్ కి డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఈ సినిమా కోసం దర్శకుడికి నటీనటులని ఎంచుకోవడం ఛాలెంజింగ్ గా మారిందట. అంధాధున్ లో కీలకపాత్ర అయిన టబు రోల్ లో ఎవరిని తీసుకోవాలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. అలాగే హీరోయిన్  ని ఎవరిని తీసుకోవాలో అర్థం కావట్లేదట. సినిమా కథ ప్రకారం హీరోకి, హీరోయిన్ కి మధ్య కొన్ని ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి. హీరోయిన్ గా ఒకరిద్దరు పేర్లని పరిశీలించినప్పటికీ, ఇంటెన్స్ తరహా పాత్రలు చేయడానికి ఒప్పుకోవట్లేదట. 

సో ప్రస్తుతం మేర్లపాక గాంధీ నితిన్ తో ఇంటెన్స్ సీన్స్ లో నటించే హీరోయిన్ ని వెతికే పనిలో పడ్డాడట. మరి నితిన్ తో రొమాన్స్ చేసే ఆ హీరోయిన్ ఎవరో చూడాలి.

Sponsored links

Director searching for heroine..:

Director searching for heroine

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019