టాలీవుడ్ సీనియర్ నటి ఇంట విషాదం

Sat 23rd May 2020 07:17 PM
sr actress vani sri,vani sri son,passes away,tollywood,abhinay venkatesh  టాలీవుడ్ సీనియర్ నటి ఇంట విషాదం
Tollywood Sr Actress Vani Sri Son Passes Away టాలీవుడ్ సీనియర్ నటి ఇంట విషాదం
Sponsored links

టాలీవుడ్ సీనియర్ నటి వాణిశ్రీ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. శనివారం ఉదయం ఆమె కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేశ్ హఠాన్మరణం చెందారు. నిద్రలో ఉండగానే ఆయనకు గుండెపోటు వచ్చిందని.. దీంతో కన్నుమూశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని కారణాల వల్ల అభినయ్ ఉరేసుకున్నారని ఫొటోలతో సహా బయటికి వచ్చాయి. అయితే ఇందులో ఏది నిజం.. ఏది అబద్ధం..? అసలేం జరిగింది..? ఆయన మృతికి కారణాలేంటి..? అనే విషయం తెలియరాలేదు. కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకూ మీడియాకు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.

అభినయ్.. హఠాన్మరణంతో వాణిశ్రీ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. వెంకటేశ్ ఇకలేడని తెలుసుకున్న ఆయన మిత్రులు, తోటి డాక్టర్లు, ఆప్తులు హుటాహుటిన చెన్నైలోని స్వగృహానికి చేరుకున్నారు. మరోవైపు.. వాణిశ్రీకి ఫోన్ చేసిన టాలీవుడ్, కోలీవుడు ప్రముఖులు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కాగా.. వాణి శ్రీకి ఒక కొడుకు.. ఒక కుమార్తె ఉన్నారు. సోదరుడు ఇక లేడని తెలిసి ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు. ‘మరపురాని కథ’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎన్నో సినిమాలు నటించారు. శ్రీదేవి, జయప్రదలు తెరపై వచ్చేవరకూ వాణిశ్రీనే అగ్రతారగానే ఉన్న విషయం తెలిసిందే.

Sponsored links

Tollywood Sr Actress Vani Sri Son Passes Away:

Tollywood Sr Actress Vani Sri Son Passes Away  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019