ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anchor Suma VS Anasuya.. What Happend!

సుమ - అనసూయల మధ్య ఆధిపత్య పోరు!?

తెలుగు వినోద రంగంలో పోటీ గట్టిగానే ఉంటుందన్న విషయం విదితమే. ఒకరు ఓ రేంజ్‌లో క్రేజ్‌తో స్టార్ అయ్యారంటే.. తాము కూడా ఆ స్థాయికెళ్లి మనమూ ఏం తక్కువ కాదని నిరూపించుకోవాలని తెగ తాపత్రయపడుతుంటారు. అలాంటి వాటిలో యాంకరింగ్ కూడా ఒకటి. తెలుగు యాంకర్స్ విషయానికొస్తే (ఫి మేల్ యాంకర్స్).. ప్రస్తుతం యాంకర్ సుమ, అనసూయ, రష్మీ, శ్రీముఖిలే టాప్‌లో ఉన్నారు. ఇక మిగిలిన యాంకర్స్ ఉన్నా అంతంత మాత్రమే. తెలుగులో ఏ షో ప్రారంభించాలన్నా దాదాపు వీరే ఉంటారు. ఆ షో నాదే.. ఈ షో నాదే అంటూ అటు ఇటూ బండి నడిపించేస్తుంటారు. అయితే.. ఈ మధ్య యాంకర్స్ మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయ్. ఆ యాంకర్స్ మరెవరో కాదు.. నంబర్ వన్ యాంకర్‌గా రాణిస్తున్న సుమ కనకాల, హాట్ హాట్ అందాలు ఆరబోసే అనసూయ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందట.

పోలికే లేదు కానీ..

తెలుగులో అటు బుల్లి తెరపై జరిగే షోలు.. ఇటు వెండితెరపై జరిగే ఆడియో, సక్సెస్ ఇలా అన్ని ఫంక్షన్స్‌లలో దాదాపు సుమనే కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆమె వాక్ ఛాతుర్యం.. మేనేజింగ్ అలా ఉంటుంది గనుక. ఒక్క మాటలో చెప్పాలంటే యాంకర్ అంటే చాలు సుమ అనే పేరు మొదట గుర్తొస్తుంది. ఇక అనసూయ విషయానికొస్తే.. సుమకు పూర్తిగా ఆపోజిట్.. అదెలాగంటే ఈమె లోనూ వాక్ చాతుర్యమూ ఉంది. ఇంకా కొన్ని కొన్ని ఎక్స్‌ట్రాలు సైతం ఉన్నాయ్. తన హాట్ హాట్ అందాలతో, మాటలతో ప్రేక్షకులను మైమరిపిస్తూ ఉంటుంది. ఒకరికి ఒకరు పోలిక అస్సలే లేదు కానీ.. ఆధిపత్య పోరు సాగుతోందని వార్తలు వినిపిస్తున్నాయ్.

ఇదీ అసలు కథ..!

తాజాగా.. ఓ ప్రముఖ చానెల్‌ కొత్తగా షో ప్రారంభించాలని మొదట సుమను సంప్రదించిందట. ఆమె తన డిమాండ్స్‌ను సదరు చానెల్ యాజమాన్యానికి చెప్పిందట. సుమారు అరగంటపాటు ఫోన్‌లో తాను యాంకరింగ్ చేస్తే ఇలా ఉంటుంది.. అలా ఉంటుందని కొన్ని కండిషన్స్ కూడా పెట్టిందట. సరే ఒక మాట హాట్ భామ అనసూయను కూడా అడుగుదామని సంప్రదించగా.. తాను రెడీగానే ఉన్నానని చెప్పిందట. అయితే ఇద్దరిలో ఎవరైతే సెట్ అవుతారని నిశితంగా ఆలోచించిన యాజమాన్యం ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వచ్చిందట. అనసూయను తీసుకుంటే సినిమాల్లో లాగే అందాల ఆరబోతతో పాటు.. అన్ని విధాలా సెట్ అవుతుంది..!. చెప్పినట్లుగానే విని యాంకరింగ్ చేస్తుందని.. పైగా రెమ్యునరేషన్ కూడా సుమతో పోలిస్తే తక్కువనేనని.. ఇలా అన్ని విధాలుగా ఆలోచించారట. మరీ ముఖ్యంగా.. అనసూయ అయితే ప్రేక్షకులను టీవీల ముందు కూర్చొబెడుతుందని.. మరోవైపు యూ ట్యూబ్‌లోనూ మంచి వ్యూస్ రాబడుతుందని ఆ హాట్ భామనే ఫైనల్ చేశారట. 

నంబర్ వన్ అంతే..!

పై దీంతో విషయం తెలుసుకున్న సుమ ఒకింత ఆగ్రహానికి లోనైందట. ఆ ఆగ్రహం అనసూయ మీదనే.. చానెల్ యాజమాన్యం మీదనో మరి. అయితే.. ఒక్క షో పోయినంత మాత్రాన ఏముంది నంబర్ వన్ నంబర్ వన్నేగా అని సుమ అనుకుందట. మరోవైపు.. అను మాత్రం అబ్బా.. సుమను కాదని నన్నే తీసుకున్నారహో అని తెగ సంబరిపడిపోతోందట. ఇలా వరుస షోలు తననే వరిస్తుండటంతో ఇక అందాల ఆరబోతలో అను మరిన్ని హద్దులు దాటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.. కుర్ర కారూ ఇక చూస్కోండహే..!

Anchor Suma VS Anasuya.. What Happend!

Anchor Suma VS Anasuya.. What Happend!
anchor suma
suma kanakala
anchor anasuya
hot anchora anasuya
suma vs anasuya