Advertisement

అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా రేంజేనా..?

Wed 08th Apr 2020 04:01 AM
pushpa,allu arjun,bunny,devi sri prasad,sukumar,aa20  అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా రేంజేనా..?
Allu Arjun Pushpa would be Pan indian movie..? అల్లు అర్జున్ పుష్ప పాన్ ఇండియా రేంజేనా..?
Advertisement

అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత బన్నీ సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. కొద్ది సేపటి క్రితమే ఈ సినిమా టైటిల్ తో పాటు బన్నీ లుక్ ని కూడా రివీల్ చేశారు. ఊరమాస్ లుక్ లో చూడగానే లారీ డ్రైవర్ అనుకునేంతగా ఉన్న బన్నీ లుక్ అదిరిపోయింది. ఈ చిత్రానికి పుష్ప అనే టైటిల్ ని ఖరారు చేశారు.

అయితే పుష్ప చిత్రం పాన్ ఇండియ రేంజ్ లో తెరకెక్కుతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. చాలా రోజుల నుండి బన్నీకి పాన్ ఇండియా మూవీ తీయాలని ఉంది. అందుకే అల వైకుంఠపురములో ప్రమోషన్స్ టైమ్ లో తెలుగుతో పాటు బాలీవుడ్ మీడియాకి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అయితే ప్రస్తుతం ఆ కలని పుష్ప ద్వారా నిజం చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. పుష్ప టైటిల్ లోగోని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాల భాషల్లోనూ రిలీజ్ చేశారు.

సాధారణంగా సినిమా పోస్టర్ ని తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో విడుదల చేశారు. కానీ వేరే భాషల్లోనూ రిలీజ్ చేయడంతో బన్నీకి పాన్ ఇండియా ఆలోచన ఉందని తెలుస్తుంది. 

Allu Arjun Pushpa would be Pan indian movie..?:

Allu Arjun Pushpa would be Pan indian movie

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement