పవన్-హరీష్ సినిమా ఇలా ఉంటుందట..

Tue 07th Apr 2020 10:39 PM
intresting update,pawan kalyan,harish shankar,pawan-harish movie  పవన్-హరీష్ సినిమా ఇలా ఉంటుందట..
Intresting Update On Pawan-Harish Shankar Movie! పవన్-హరీష్ సినిమా ఇలా ఉంటుందట..
Sponsored links

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన హరీశ్ శంక‌ర్ సినిమాలు ఎలా ఉంటాయో తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆయన ఏ హీరోతో సినిమా తీసినా అది సూపర్ డూపర్ హిట్టే. అంతేకాదు మళ్లీ సినిమా చేద్దాం అంటే చాలు.. ఏవైనా సినిమా కమిట్ అయినా సరే పక్కనెట్టేస్తుంటారు. ఎందుకంటే.. ఆయన సినిమాల్లో ఎమోషనల్ సీన్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ అలా ఉంటాయ్.. వీటన్నింటితో మంచి విషయం ఉంటుంది గనుక కచ్చితంగా హిట్ పడుతుందన్న ఓ నమ్మకం. అందుకే పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ అనగానే హరీష్ శంకర్‌తో సినిమా అంటే టక్కున ఓకే అనేయడం.. నిర్మాణ సంస్థ కూడా అధికారిక ప్రకటన చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయ్.

ఫ్యాన్స్‌కు ఏం కావాలి..?

అన్నీ సరే.. సినిమా ఎలా ఉండబోతోంది..? ఏ నేపథ్యంలో సినిమా ఉంటుంది..? పొలిటికల్ టచ్ ఉంటుందా..? లేకుంటే ఇంకేమైనా ఉంటాయా..? అనే విషయాలపై మాత్రం క్లారిటీ రాలేదు. అయితే.. హరీష్ సినిమాలన్నీ చాలా వెరైటీగా ఉంటాయ్ గనుక.. కచ్చితంగా కొత్తదనం ఉంటుంది హిట్ పడుతుందని మెగాభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. తాజాగా ఈ కథకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగు చూశాయి. మరోవైపు ప్రస్తుతం లాక్‌డౌన్ నడుస్తుండటంతో హరీష్ పూర్తిగా కథపైనే కసరత్తులు చేస్తున్నాడట. అసలు మెగా ఫ్యాన్స్‌కు ఏమేం కావాలి..? ఏమేం ఆశిస్తున్నారు..? అనే దానిపై నిశితంగా ఆలోచించి.. పరిశీలించి కథ రెడీ చేస్తున్నాడట.

ఇవన్నీ ఉంటాయట..

సినిమాలో లవ్, యాక్షన్, ఎమోషన్, కామెడీ, ఐటమ్ సాంగ్‌ ఉంటాయట. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతారట. అయితే పొలిటికల్ టచ్ మాత్రం అంతగా ఉండకపోవచ్చనే టాక్ నడుస్తోంది. వీటన్నింటికీ మించి కథ మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందట. మొత్తానికి చూస్తే అన్ని యాంగిల్స్‌ను హరీష్ టచ్ చేయబోతున్నాడని దీన్ని బట్టి తెలుస్తోంది. అయితే.. ఇదివరకే ఈ కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. మరి ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో..? ‘గబ్బర్ సింగ్‌’ రేంజ్ ఉంటుందా..? లేకుంటే అంతకుమించి ఉంటుందా..? అనేదానిపై అభిమానుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Sponsored links

Intresting Update On Pawan-Harish Shankar Movie!:

Intresting Update On Pawan-Harish Shankar Movie!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019