మొన్న హృతిక్.. ఇప్పుడు దిశా పటానీ..!!

Wed 01st Apr 2020 05:51 PM
allu arjun,ala vaikuntapurramloo song,disha patani,hrithik,praises  మొన్న హృతిక్.. ఇప్పుడు దిశా పటానీ..!!
disha patani Praises allu Arjun dance మొన్న హృతిక్.. ఇప్పుడు దిశా పటానీ..!!
Sponsored links

టాలీవుడ్‌లో అల్లు అర్జున్ డాన్స్ కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ మాట పక్కనబెడితే అల్లు అర్జున్ డాన్స్ కి తాజాగా బాలీవుడ్ నటుడు హ్రితిక్ రోషన్ ఫిదా అయ్యాడు. ఏం తింటాడు బన్నీ డాన్స్ విషయంలో అల్లు అర్జున్ ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్ అదుర్స్ అన్నాడు. తాజాగా అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ థమన్ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ కి అల్లు అర్జున్ స్టైలిష్ స్టెప్స్ కూడా తోడై అన్ని పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అయితే అల వైకుంఠపురములో అల్లు అర్జున్ డాన్స్ చూసి ఓ బాలీవుడ్ హాటీ ఫిదా అయ్యింది. అదే విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అల్లు అర్జున్ కి తెలియపరిచింది. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ఐటమ్స్ సాంగ్స్ స్పెషలిస్ట్, హాట్ అందాల దిశా పటానీ. దిశా సాంగ్ కోసం సెట్స్ లోకి వచ్చింది అంటే ఆమె డాన్స్ తో సెట్స్ దడదడలాడాల్సిందే, అలాగే దిశా పటానీ బికినీ షోకి అందరూ అర్రులు చాచాల్సిందే.

అలాంటి హాటీ కి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో బుట్ట బొమ్మ బుట్టబొమ్మ సాంగ్ కి వేసిన స్టెప్స్ బాగా నచ్చాయట. బుట్టబొమ్మ సాంగ్ లోని అల్లు అర్జున్ బల్ల మీద జారే స్టెప్ వీడియో ని షేర్ చేస్తూ.. అల్లు అర్జున్ ఈ స్టెప్ ఎలా వేశారు అంటూ ట్వీట్ చెయ్యగా.. దానికి బన్నీ కూడా నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అలా మంచి మ్యూజిక్ నాతో డాన్స్ చేయిస్తుంది. మీ ప్రశంసకు ధన్యవాదాలు అనగా.. దానికి దిశా పటానీ కూడా... డాన్స్ విషయంలో మాకు స్ఫూర్తిగా ఉన్నందుకు థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది. 

Sponsored links

disha patani Praises allu Arjun dance:

bollywood Celebrities praises Bunny Dance 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019