అభిమానుల ఆశలు నా మీద ఒత్తిడి పెంచవు..

Sun 29th Mar 2020 12:10 PM
rajamouli,rrr,ntr,ramcharan,rajeev masand  అభిమానుల ఆశలు నా మీద ఒత్తిడి పెంచవు..
Those expectations didnt stress to me. అభిమానుల ఆశలు నా మీద ఒత్తిడి పెంచవు..
Sponsored links

ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ కి యూట్యూబ్ లో విశేష స్పందన లభిస్తుంది. రౌద్రం రణం రుధిరం అంటూ వచ్చిన ఈ టైటిల్ ని ఆర్ ఆర్ ఆర్ గానే పిలుస్తున్నారు. టైటిల్ తో అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసిన రాజమౌళి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి మరింత పెంచాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది. ఎవ్వరి అంచనాలకి అందని విధంగా రామరాజు లుక్ ని డిజైన్ చేశాడు.

రామ్ చరణ్ లుక్ ని రిలీజ్ చేసిన నేపథ్యంలో రాజమౌళి బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మాసంద్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. కరోనా కారణంగా ప్రతీ ఒక్కరు ఇళ్ళకే పరిమితమైన తరుణంలో వీడియో చాట్ ద్వారా రాజమౌళిని పలకరించాడు. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఇద్దరు సూపర్ స్టార్ హీరోలతో సినిమా చేస్తున్నప్పుడు వారి అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు.. మా హీరోని అలా చూపించాలి.. ఇలా చూపించాలి అని అనుకుంటారు.

సోషల్ మీడియా ద్వారా అడుగుతుంటారు కుడా. అలాంటి టైమ్ లో అభిమానుల గురించి ఆలోచిస్తారా... వాళ్ల అంచనాలని దృష్టిలో పెట్టుకుంటారా అని అడిగారు. దానికి సమాధానంగా రాజమౌళి చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. అభిమానులు చాలా తక్కువ మందే ఉంటారు. వారి కంటే జనరల్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు. నేను తీసే సినిమా జనరల్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయితే ఎక్కువ సంతోషిస్తానని చెప్పాడు.

Sponsored links

Those expectations didnt stress to me.:

Rajamouli said fans are very few.. but general audiences are more 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019