‘ఆహా’.. సక్సెస్‌ఫుల్ నిర్మాత ప్లాప్ కొట్టాడు

Allu Aravind Failed with Aha OTT

Wed 25th Mar 2020 05:25 PM
allu aravind,sketch,fail,aha ott  ‘ఆహా’.. సక్సెస్‌ఫుల్ నిర్మాత ప్లాప్ కొట్టాడు
Allu Aravind Failed with Aha OTT ‘ఆహా’.. సక్సెస్‌ఫుల్ నిర్మాత ప్లాప్ కొట్టాడు
Advertisement

అల్లు అరవింద్ నిర్మాతగా సూపర్ హిట్. పర్ఫెక్ట్ గా సినిమాలను నిర్మించి బోలెడంత సంపాదించాడు. గీతా ఆర్ట్స్ మీద అరవింద్ బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, హిట్ సినిమాలను నిర్మించాడు. ఇప్పటికి గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 మీద సినిమాలు చేస్తున్నాడు. అయితే నిర్మాతగా సూపర్ హిట్ అయిన అల్లు అరవింద్ తాజాగా ఓటిటి ప్లాప్ ఫార్మ్ లోకి ఎంటర్ అయ్యాడు. హడావిడిగా భారీగా ఆహా అంటూ ఓ యాప్ ని ఓపెన్ చేసిన అల్లు అరవింద్ దానిని హ్యాండిల్ చెయ్యడంలో అడుగడుగునా తడబడుతున్నాడు. ఆహా కి ఎంత ప్రచారం కల్పించినా.. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి ఓటిటి ప్లాప్ ఫార్మ్స్ ముందు తేలిపోయింది.

తాజాగా కరోనా ఎఫెక్ట్ తో ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ డిమాండ్ ఓ రేంజ్ లో పెరిగింది. అందరూ అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లలో సినిమాలు చూస్తూ బిజీగా వున్నారు. కరోనాతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఇలా ఓటిటి ప్లాట్ ఫామ్స్ ని ఫుల్ గా వాడడంతో వాటి డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లలో ఉన్న ఆప్షన్స్ చాలక ఇంకా ఆప్షన్స్ వెతుకుతున్నారు జనాలు. ఈ అవకాశాన్ని కూడా ఆహా ప్లాట్ ఫారం సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. ఆహాలో అందరూ చూసే సినిమాలు లేవు. తగినన్ని సినిమాలు లేవు. తాజాగా విడుదలైన డిజాస్టర్ సినిమాలు మాత్రమే ఆహాలో కనిపిస్తున్నాయి. ఇక ఆహా యాప్ చూడడానికి కి ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. సో అల్లు అరవింద్ ఆహా ని కరెక్ట్ టైం లో కరెక్ట్ గా ఉపయోగించుకోలేక ప్లాప్ అయ్యాడన్నమాట.

Allu Aravind Failed with Aha OTT :

Allu Aravind Sketch not worked 


Loading..
Loading..
Loading..
advertisement