ఈ భూమి మనది మాత్రమే కాదు.. పూరి జగన్నాథ్..

Tue 24th Mar 2020 11:27 AM
puri jagannadh,deers,corona virus,total lockdown,covid 19,planet  ఈ భూమి మనది మాత్రమే కాదు.. పూరి జగన్నాథ్..
we are sharing this planet with .... Puri Jagannath ఈ భూమి మనది మాత్రమే కాదు.. పూరి జగన్నాథ్..
Sponsored links

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాస్ సినిమాలు తీయడంలో దిట్ట అని అందరికీ తెలుసు. తన సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ చాల రెబల్ గా ఉంటుంది. తన సినిమాల్లో హీరోలాగే నిజ జీవితంలో పూరి కూడా చాలా రెబల్ గా కనిపిస్తారు. తనకి అనిపించిన భావాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం పూరీకి అలవాటు. ఏదైనా విషయాన్ని చెప్పాల్సి వచ్చినపుడు నెగెటివ్ వేలో చెప్పడం తనకి అలవాటు. ప్రస్తుతం కరోనా కారణంగా విజయ్ తో సినిమా షూటింగ్ ఆపేసిన పూరి ఇంటికే పరిమితమైపోయాడు.

కరోనా వైరస్ కారణంగా దేశమంతతా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  ఇదిలా ఉంటే లాక్ డౌన్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. రోడ్ల మీద జనాలు లేక ఖాళీ ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో జింకలు రోడ్ల మీద తిరుగుతున్నాయి. తాజాగా కోయంబత్తూర్ రోడ్లమీద జింకలు సేదతీరుతున్న ఫోటోని పూరిజగన్నాథ్ షేర్ చేశాడు. అయితే ఈ భూమి మన ఒక్కరిదే కాదని, ఈ గ్రహాన్ని జంతువులతో పాటు మనం కూడా షేర్ చేసుకుంటున్నాం అని కామెంట్ చేశాడు.

పూరి జగన్నాథ్ కి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం అన్న విషయం చాలా మందికి తెలుసు. చెట్లన్నా, జంతువులన్నా ఆయన ఎక్కువ ఇష్టపడతాడు. మనుషులమైన మనం ఈ భూమి మనకోసమే ఉందన్న అహంభావంతో ఇతర జంతువులకి స్వేఛ్ఛ ఇవ్వకుండా చేస్తున్నాం. అదే ఉద్దేశ్యాన్ని పూరి తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

Sponsored links

we are sharing this planet with .... Puri Jagannath:

Puri jagannath tweeted about our planet

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019