‘కార్తికేయ‌2’ ప్రారంభానికి రెడీ..!

Karthikeya 2 Movie Latest UpdateKarthikeya 2 Movie Latest Update

నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ‘కార్తికేయ‌2’ మార్చి 2 న తిరుమ‌ల తిరుప‌తిలో పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం.

నిఖిల్‌, చందు మెుండేటిల కాంబినేష‌న్ లో మ్యాజిక్ రిపీట్‌:

24 అక్టోబ‌ర్ 2014 సంవ‌త్స‌రం కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌తో యూత్ ఐకాన్ గా నిఖిల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్న స‌మ‌యంలో కార్తికేయ అనే ప్ర‌తిష్టాత్మ‌క థ్రిల్ల‌ర్ విడుద‌ల‌య్యి సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఆ త‌రువాత నిఖిల్ ఎన్ని చిత్రాలు చేసినా ఎన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్స్ చేసినా కూడా కార్తికేయ క్రేజ్ వేర‌నే చెప్పాలి. సోష‌ల్ మీడియాలో కార్తికేయ సీక్వెల్ ఎప్పుడు అని ఇటు నిఖిల్ ని, అటు ద‌ర్శ‌కుడు చందు మెుండేటిని కామెంట్ చెయ్య‌ని నెటిజ‌న్స్ లేర‌నే చెప్పాలి. అంత‌లా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. యానిమల్ హిప్న‌టిజం అనే కొత్త కాన్సెప్ట్ ని ఆ చిత్రం ద్వారా తెలుగుకి ప‌రిచ‌యం చేశారు. ఇన్నాళ్ళ‌కి మళ్ళీ వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో చిత్రం అది కూడా కార్తికేయ2 గా రావ‌టం యావ‌త్ తెలుగు సినీ ప్రేక్ష‌కుల ఆనందానికి అవ‌ధులు లేవు. ఈ చిత్రాన్ని మార్చి2 న తిరుమ‌ల తిరుప‌తిలో పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది.  శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి స‌న్నిధానంలో పూజాకార్య‌క్ర‌మాల‌తో ప్రారంభం కావ‌టంతో యూనిట్ స‌భ్యులు త‌మ ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచారు.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి & అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ నిర్మాణం లో బ్లాక‌బ‌స్ట‌ర్ కాంబినేష‌న్‌:

మంచి చిత్రాలు క‌మ‌ర్షియ‌ల్ విలువ‌లతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తున్న క్రేజి నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి మ‌రియు అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌.  ఈ రెండు నిర్మాణ సంస్థ‌లు విడివిడిగా ఎన్నో సూప‌ర్‌హిట్స్ అందించారు. అలాగే క‌లిసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ అందించారు. ఇప్పుడు మ‌రోక్క‌సారి బ్లాక్‌బ‌స్ట‌ర్ స్టోరీని నిఖిల్‌, చందుమెండేటి  క్రేజి కాంబినేష‌న్ లో మార్చి2న తిరుమల తిరుప‌తిలో పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకుని ప్రారంభం అవుతుంది. సినిమా అంటే క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలే కాదు ప్రేక్ష‌కుడ్ని అల‌రించే విధంగా వుండాలి అనే ఫ్యాష‌న్ తో చిత్రాలు నిర్మించి తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో అగ్ర నిర్మాతగా పేరుగాంచిన టి.జి విశ్వ‌ప్ర‌సాద్ గారు , ప్రేక్ష‌కుడి నాడి ని జ‌డ్జ్ చేసి వారిని అల‌రించే చిత్రాలు నిర్మించి టాలీవుడ్ లో క్రేజి ప్రోడ్య‌స‌ర్ గా పేరుగాంచిన అభిషేక్ అగ‌ర్వాల్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2020 లో కార్తికేయ‌2 విడుద‌ల :

‘‘అర్జున్ సుర‌వ‌రం’’ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌రువాత ఏ చిత్రం చేయ‌కుండా కొంత గ్యాప్ తీసుకుని ప్రేక్ష‌కుల‌కి, త‌న అభిమానుల‌కి కిక్ ఇచ్చే చిత్రం చేయాల‌ని గ‌ట్టి సంక‌ల్పంతో నిఖిల్ కార్తికేయ‌2 కి శ్రీకారం చుట్టారు. ఎలాంటి స్క్రిప్ట్ తీసుకున్నా కూడా  సామాన్య‌ ప్రేక్ష‌కుడికి కూడా అర్థ‌మ‌య్యేలా, అల‌రించేలా త‌న పెన్ కి ప‌నిపెట్టే ద‌ర్శ‌కుడు చందు మెుండేటి మ‌రోక్క‌సారి మ‌న‌కి తెలియ‌ని కొత్త క‌థతో రాబోతున్న చిత్రం కార్తికేయ‌2. ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి కార్తికేయ‌2 లో వున్న స‌ర్‌ప్రైజ్ లు స‌రికొత్త‌గా ఒక్కోక్క‌టి అతి త్వ‌ర‌లో తెలియ‌జేస్తూ 2020 చివ‌రి ఛాప్ట‌ర్ లో విడుద‌ల చేయ‌నున్నారు.

బ్యాన‌ర్‌..  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌

పిఆర్ ఓ .. ఏలూరు శ్రీను

కొ-ప్రోడ్యూస‌ర్ .. వివేక్ కూచిభొట్ల

నిర్మాత‌లు.. టి.జి విశ్వ ప్ర‌సాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌

క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్యం.. చందు మెుండేటి

Karthikeya 2 launched on March 2nd with pooja ceremony at Tirumala

nikhiil
chandu mondeti
karthikeya 2
launch
march 2
pooja ceremony
tirumala
O.M Review
O.M Review
25 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
25 Nov 2026
DNK Review
DNK Review
25 Nov 2026
GOAT Review
GOAT Review
25 Nov 2026
Scene Review
Scene Review
25 Nov 2026
Ramayana Review
Ramayana Review
25 Nov 2026