Advertisement

పవన్ సత్యాగ్రహి బూజు దులుపుతున్నాడా?

అందరిలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా ఓ డ్రీం ప్రాజెక్ట్ ఉంది. ఎప్పటినుండో సత్యాగ్రహి అనే సోషల్ మెసేజ్ ఫిల్మ్ చేయాలని పవన్ కళ్యాణ్ కలలు కన్నాడు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ చిత్రాన్ని AM రత్నం నిర్మాణంలో మొదలెడదామనుకుంటే... చాలా కారణాల వలన ఈ చిత్రం ఆపేసాడు పవన్ కళ్యాణ్. అప్పటి నుండి ప్రాజెక్టును పునరుద్ధరించడానికి చాలా ప్రయత్నాలే చేసారు. కానీ అది జరగలేదు. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని లైన్ లోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాని లైన్ లోకి తేవడానికి డిసైడ్ అయ్యాడని అంటున్నారు.

ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఐడెంటిటీ కోసం పోరాడుతున్నాడు. అందుకే ఈ సత్యాగ్రహి చిత్రం తన రాజకీయ జీవితానికి ఎంతో సహాయపడుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడని అందుకే ప్రస్తుతం సత్యాగ్రహి స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ సినిమాని నిర్మించేందుకు నిర్మాతలెవరూ ముందుకు రావడం లేదని ఫిలింనగర్ టాక్. ఈ ప్రాజెక్టుపై భారీగా పెట్టుబడి పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రచన లేదా దర్శకత్వంలో పాల్గొన్నప్పుడల్లా ఆ సినిమాలు ప్లాప్ అవుతున్నాయనే నమ్మకంతో నిర్మాతలు ఉన్నారట. అందుకే ఎవరూ ముందుకు రావడం లేదని ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి.

Pawan Wants Producer for his Satyagrahi

Again Pawan Satyagrahi in News
pawan kalyan
wants
producer
satyagrahi