నయన్ ‘వసంతకాలం’తో వస్తోంది

లేడీ సూపర్ స్టార్ నయనతార  చేసే నట మాయాజాలం ‘వసంతకాలం’ యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్

లేడి సూపర్ స్టార్ నయనతార నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ ‘వసంత కాలం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్. 

5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారు. ‘బిల్లా- 2’ ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వం వహించారు.  రేపు (ఫిబ్రవరి 21) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంతకుముందు ‘ఏకవీర, వెంటాడు-వేటాడు’ వంటి భారీ చిత్రాలు అందించిన యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘టాప్ హీరోలకు తీసిపోని సూపర్ క్రేజ్ కలిగిన నయనతార నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ‘వసంతకాలం’.  సస్పెస్న్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది.. అన్నారు!!

Nayanthara Vasanthakalam Movie Release on Feb 21st

Vasanthakalam Movie Ready to Release
nayanthara
vasanthakalam
movie
release
february 21