నానికి రెండో హిట్ పడేలా ఉంది....

Wed 19th Feb 2020 01:10 PM
hit,nani,vishwaksen  నానికి రెండో హిట్ పడేలా ఉంది....
Nani wil get a second HiT as a నానికి రెండో హిట్ పడేలా ఉంది....
Sponsored links

నేచురల్ స్టార్ నాని హీరోగా వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఏ ఏడాది ఉగాది కానుకగా వి సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. అయితే అంతకుముందే మరో సినిమాతో నాని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే హీరోగా కాదు నిర్మాతగా.... అ సినిమాతో వాల్ పోస్టర్ బ్యానర్ ని స్థాపించి నిర్మాతగా మారిన నాని అ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన అ సినిమా ఉత్తమ మేకప్ప్ విభాగంలో జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది.

 

అ సినిమా తర్వాత నాని బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం హిట్. ఫలక్ నుమా దాస్ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా రుహానీ శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ బ్యానర్ లో ప్రశాంత్ త్రిపిర్నేని నిర్మిస్తుండగా నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ట్రైలర్ చూస్తుంటే థ్రిల్లర్ కథగా తెలుస్తుంది. ప్రీతి అనే అమ్మాయి మిస్సింగ్ కేసుని డీల్ చేసే పోలీస్ ఆఫీసరుగా విశ్వక్ సేన్ కనిపిస్తున్నాడు.

 

ఆ అమ్మాయి ఎలా మిస్సయింది..ఆమెకి ఏం జరిగింది అనే అంశాలని చాలా థ్రిల్లింగ్ అంశాలతో చూపెడుతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ చూస్తుంటే హిట్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం కనిపిస్తుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి ౨౮వ తేదీన విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ సినిమా హిట్ అయితే నిర్మాతగా నాని ఖాతాలో రెండో హిట్ పడినట్టే...

Sponsored links

Nani wil get a second HiT as a:

Hero viswaksen upcoming movie HIT trailer released..

Tags:   HIT, NANI, VISHWAKSEN

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019