సుధీర్‌కి రష్మీ.. ఆదికి అనసూయ!

Wed 19th Feb 2020 11:39 PM
aadi,jabardasth,success,secret,skit,rashmi,anasuya  సుధీర్‌కి రష్మీ.. ఆదికి అనసూయ!
Rashmi for Sudheer.. Anasuya for Aadhi సుధీర్‌కి రష్మీ.. ఆదికి అనసూయ!
Sponsored links

జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ అంత తొందరగా పాపులర్ అవడానికి కారణం ఒక రకంగా యాంకర్ రష్మీ అని చెప్పొచ్చు. రష్మీ - సుధీర్ మధ్యలో సం థింగ్ సం థింగ్ అంటూ ప్రచారం జరగడంతో వాళ్ళ పెయిర్ ఆటోమాటిక్ గా హిట్ అయ్యింది. జబర్దస్త్ లోనే కాదు ఢీ షోలోను రష్మీ - సుధీర్ మేటర్ మాములుగా వైరల్ అవడం లేదు. సుధీర్ లేనిదే రష్మీ లేదు, రష్మీ లేనిదే సుధీర్ లేడు అన్న రేంజ్ లో వాళ్ళ మధ్యన ఉన్న సం థింగ్ సం థింగ్ రిలేషన్ పాపులర్ అయ్యింది. అయితే వాళ్ళ మధ్యలో ఏం లేదని సుధీర్ - రష్మీ మొత్తుకున్నా ప్రేక్షకులు వినే పరిస్థితిలో లేరు.

తాజాగా జబర్దస్త్ నటుడు ఆది కూడా అనసూయతో బాగా పాపులర్ అవడానికి ట్రై చేస్తున్నాడు. జబర్దస్త్ స్టేజ్ మీద హైపర్ ఆది స్కిట్స్ కి ఓ స్పెషల్ ఉంది. ఆది పంచ్ లకు అందరూ పడి పడి నవ్వాల్సిందే. కేవలం పంచ్‌ల మీదే కాలం వెళ్ళదని అనసూయని వాడడం మొదలెట్టాడు. అనసూయతో స్టేజ్ మీద డాన్స్ లు, సెటైర్స్ అబ్బో మామూలుగా కాదు. అనసూయతో స్కిట్స్ చేసి హిట్ కొట్టడం మొదలెట్టిన ఆది మధ్యలో అనేకమంది యాంకర్స్ ని తీసుకొచ్చినా అనసూయ పేరు వాడకం మానడం లేదు. ఇక అనసూయ తనతో స్కిట్ లో లేకపోయినా ఎవరో ఒకరికి ఆమె పేరుతో ఓ పాత్రను సృష్టించి స్కిట్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. మరి అనసూయ కూడా ఆది స్కిట్స్ తో ఎంజాయ్ చేస్తుంది అనుకోండి. అయినా ఆది మాత్రం అనసూయని నమ్ముకుని స్కిట్స్ మీద స్కిట్స్ కొడుతున్నాడు.

Sponsored links

Rashmi for Sudheer.. Anasuya for Aadhi:

Jabardasth: Aadi Skit Success Secret

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019