జానుని వదిలేసి పింక్ రీమేక్‌ని చూపిస్తున్నాడట!

Mon 17th Feb 2020 10:10 PM
dil raju,jaanu,hopes,pawan kalyan,pink,remake  జానుని వదిలేసి పింక్ రీమేక్‌ని చూపిస్తున్నాడట!
Dil Raju Hopes on Pink Remake జానుని వదిలేసి పింక్ రీమేక్‌ని చూపిస్తున్నాడట!
Sponsored links

దిల్ రాజు ఎంతో ఇష్టపడి, ప్రేమించి, ఎంతో నమ్మకంతో 96 రీమేక్ రైట్స్ కొనుక్కుని జాను సినిమాని రీమేక్ చేసాడు. ఆ సినిమా సూపర్ హిట్ టాకే. కానీ సినిమాకి కలెక్షన్స్ మాత్రం రాలేదు. అయినా దిల్ రాజుకి చిన్న బాధ కూడా లేదు. సినిమా హిట్ అయ్యింది చాలు. అన్నట్టుగా సైలెంట్ అయ్యాడు అయితే సినిమాకి కలెక్షన్స్ రావని ముందే తెలుసన్నట్టుగా పెద్దగా ప్రమోషస్న్ కి ఖర్చు పెట్టలేదు దిల్ రాజు. అయితే జాను సినిమాకి కోట్లు దండుకుందామనుకున్న దిల్ రాజుకి జాను దెబ్బేసింది. అయినా దిల్ రాజు మాత్రం తాను నమ్మిన సిద్ధాంతానికి మూడే కాళ్ళు అన్నట్టుగా పవన్ తో పింక్ రీమేక్ చేస్తున్నాడు.

పింక్ రీమేక్ పై కూడా ట్రేడ్ లో అనుమానాలు మొదలయ్యాయి. కానీ దిల్ రాజు కేవలం పవన్ క్రేజ్ మీదే ఆధారపడ్డాడు. పవన్ క్రేజ్ తో సినిమా పక్కా హిట్ అనుకుంటున్నాడు. పింక్ బడ్జెట్ కూడా సో సో అన్నట్టుగానే ఉంది. అందుకే దిల్ రాజు టెంక్షన్ పడడం లేదు. బాలీవుడ్, తమిళ్ లో సూపర్ బ్లాక్ బస్టర్ అయిన పింక్ తెలుగులో హిట్ అయితే అవుతుంది. కానీ కలెక్షన్స్ మాత్రం రావని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని భారీ ధరలకు కొన్నప్పటికీ కలెక్షన్స్ రాకపోతే దిల్ రాజుకి బ్యాండ్ తప్పదని అంటున్నారు. అయినా దిల్ రాజుకి మాత్రం పింక్ రీమేక్ పై అనుమాలొద్దు నాకు నమ్మకముంది. డబ్బులు వాటంత అవే వస్తాయని నమ్మకంగా సన్నిహితుల దగ్గర చెబుతున్నాడట.

Sponsored links

Dil Raju Hopes on Pink Remake:

Dil Raju Disappointed with Jaanu, hopes on Pink Remake

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019