Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Naveen Chandra ‘Nenu Leni Naa Prema Katha’ movie FL Launched by Dil Raju

దిల్‌రాజు చేతులు మీదుగా ‘ నేను లేని నా ప్రేమ‌క‌థ‌’

డిఫరెంట్ రోల్స్ తో తెలుగు ఆడియన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ చంద్ర ఒక కొత్తరకం ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ వాలంటైన్స్ డే స్సెషల్ గా ‘ నేను లేని నా ప్రేమకథ’ ఫస్ట్ లుక్ ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు లాంఛ్ చేసారు. ఒక విభిన్నమైన ప్రేమకథగా ప్రేక్షకులు ముందుకు త్వరలో రాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్ గా ఉందని దిల్ రాజు అభినందించారు. చిత్రాన్ని ఎమ్ ఎస్ సుబ్బల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో త్రిషాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై క‌ళ్యాణ్ కందుకూరి నిర్మాత‌గా సురేష్ ద‌ర్శ‌క‌త్వం లో రూపోందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్టో ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతున్నఈ సినిమాలో న‌వీన్ చంద్ర స‌ర‌స‌న గాయ‌త్రి ఆర్ సురేష్ హీరోయిన్ గా చేస్తుంది. క్రిష్ సిద్దిప‌ల్లి, అదితి లు మ‌రో ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రంల ప్ర‌ముఖ న‌టుడు రాజార‌వీంద్ర కీల‌క పాత్ర‌లో న‌టించారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత క‌ళ్యాణ్ కందుకూరి మాట్లాడుతూ..‘దిల్ రాజు గారు మా సినిమా ఫస్ట్ లుక్ ని లాంఛ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రేమకథ లు తెరపై చాలా కనిపించినా ఈ ప్రేమకథ అందించే ఎక్స్ పీరియన్స్ కొత్తగా ఉంటుంది.  ఈ సినిమా చూసిన ప్ర‌తిఓక్క‌రూ వారి వారి ప్రేమ క‌థ‌కి కి ద‌గ్గ‌ర‌వుతారు. న‌వీన్ చంద్ర‌, హీరోయిన్ గాయ‌త్రి ఆర్ సురేష్ వారి పాత్ర‌ల్లో ఇమిడిపోయి న‌టించారు. ఈ సినిమాకి జువిన్ సింగ్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ఈ కాన్సెప్ట్ గురించి తెలుసుకొని దిల్ రాజు గారు అభినందించారు’ అన్నారు.

న‌టీన‌టులు.. న‌వీన్ చంద్ర‌, గాయ‌త్రి ఆర్ సురేష్‌, క్రిష్ సిద్దిప‌ల్లి, అదితి, రాజారవీంద్ర , బందు దివిజ త‌దిత‌రులు న‌టించ‌గా..

ఎమ్ ఎస్ సుబ్బ‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌

బ్యాన‌ర్‌.. త్రిషాల ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

కొ-ప్రోడ్యూస‌ర్స్‌.. గూడురు వెంక‌ట్‌, గూడురు ప్ర‌సాద్‌

కెమెరా.. ఎస్‌.కె.ఏ.భూప‌తి

ఎడిట‌ర్‌.. ప్ర‌వీణ్ పూడి

మాట‌లు.. స‌భీర్ షా

సంగీతం.. జువెన్ సింగ్‌

లిరిక్స్‌.. రాంబాబు గొసాల‌

పి ఆర్ ఒ ..జియస్ కె మీడియా

Naveen Chandra ‘Nenu Leni Naa Prema Katha’ movie FL Launched by Dil Raju

Naveen Chandra 'Nenu Leni Naa Prema Katha' movie FL Launched by Dil Raju
naveen chandra
nenu leni naa prema katha
dil raju