సమంతను చూపిస్తూ.. ‘జాను’ని వదిలేశాడేంటి?

No attractive Promotions to Dil Raju Jaanu Movie

Sat 01st Feb 2020 10:01 PM
Advertisement
dil raju,jaanu,samantha,sharwanand,promotions,jaanu movie  సమంతను చూపిస్తూ.. ‘జాను’ని వదిలేశాడేంటి?
No attractive Promotions to Dil Raju Jaanu Movie సమంతను చూపిస్తూ.. ‘జాను’ని వదిలేశాడేంటి?
Advertisement

సమంత ప్రస్తుతం పాపులర్ హీరోయిన్. పెళ్లయినా ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్. అందుకే సమంత క్రేజ్ చాలు మనకి ఇంకేం అవసరం లేదనుకున్నాడు దిల్ రాజు. అందుకే 96 రీమేక్ జాను ప్రమోషన్స్ పెద్దగా చేయడం లేదు. రాబోయే శుక్రవారం విడుదల కాబోతున్న జాను ప్రమోషన్స్‌లో ఊపు లేదు. సమంత - శర్వానంద్ జంటగా తెరకెక్కిన 96 రీమేక్ జాను సినిమాకి ప్రేక్షకుల్లోనూ ట్రేడ్‌లోను పెద్దగా క్రేజ్ కనబడడం లేదు. తమిళంలో క్లాసిక్ హిట్ అయిన 96 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడం అవార్డులు కొల్లగొట్టటం కూడా అయ్యింది. అలాంటి సినిమాని తెలుగులో రీమేక్ చేసిన దిల్ రాజు ఆ సినిమాకి పక్కా ప్రమోషన్స్ చేస్తే సినిమాకి క్రేజ్ వస్తుంది.

అసలు జాను సినిమా ఎప్పుడు విడుదల అన్న విషయం కూడా బిసి సెంటర్స్ ఆడియన్స్‌కి ఐడియా లేదు. జాను మల్టిప్లెక్స్ ఆడియన్స్ తప్ప బిసి సెంటర్స్‌కి ఎక్కే సినిమా కాదనేది వారి అభిప్రాయమేమో మరి. ప్రమోషన్స్‌లో కాస్త వెరైటీ చూపిస్తే ఈ సినిమా అందరి చెంతకు చేరే అవకాశం ఉంది. కానీ దిల్ రాజుకి సినిమా మీద నమ్మకమో.. లేదంటే సమంత టాప్ క్రేజున్న హీరోయిన్ కదా.. ఇంతకన్నా ప్రమోషన్స్ అవసరమా అనుకున్నాడో.. కానీ జాను సినిమా విషయంలో ఆయన ఎంత లైట్‌గా ఉన్నాడో ప్రస్తుత ప్రమోషన్ కార్యక్రమాలు చూస్తే తెలుస్తుంది. శర్వానంద్ అయితే సోషల్ మీడియాలో తనవంతుగా ప్రచారం చేసుకుంటున్నాడు. 

అయినా తమిళంలో అంత పెద్ద హిట్ అయిన ఈ సినిమాని చాలామంది చూసేసారు... అందుకే జాను సినిమా విషయంలో ప్రేక్షకులు కూడా లైట్ తీసుకున్నట్టుగా ఉన్నారు. లేదంటే దిల్ రాజు సినిమా అంటే ఈ పాటికి ఏదో రకంగా హడావుడి మొదలై ఉండేది. కానీ ఈ జానుకి అలాంటిది ఏమీ జరగడం లేదు. మరి ఈ వారం రోజుల్లో అయినా ఏమైనా కదలిక వస్తుందేమో చూద్దాం.

Advertisement

No attractive Promotions to Dil Raju Jaanu Movie :

Dil Raju Hopes on Samantha for Jaanu

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement