‘డిస్కోరాజా’ సెకండ్ టీజర్ అదిరింది

Tue 14th Jan 2020 08:44 PM
ravi teja,disco raja,second,teaser,released  ‘డిస్కోరాజా’ సెకండ్ టీజర్ అదిరింది
Superb Response to Disco Raja Second Teaser ‘డిస్కోరాజా’ సెకండ్ టీజర్ అదిరింది
Sponsored links

మాస్ మహారాజ రవితేజ డిస్కోరాజ సెకండ్ టీజర్ విడుదల !!!

మాస్ మహారాజ ర‌వితేజ ప్ర‌స్తుతం డిస్కో రాజా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాల ఫేం వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ లు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకి ఎస్‌.ఎస్‌. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

ఇటీవల విడుదలైన డిస్కో రాజా సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ చిత్ర కొత్త టీజర్ ను యూనిట్ విడుదల చేసింది. రవితేజ డైనమిక్ గా కనిపిస్తున్న ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. జనవరి 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా చేయబోతున్నారు. జనవరి 24 న డిస్కో రాజా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Click Here for Teaser

Sponsored links

Superb Response to Disco Raja Second Teaser:

Disco Raja Second Teaser Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019