సుకుమార్ చెప్పాడా.. ఇక హిట్టే..!!

Tue 31st Dec 2019 09:35 PM
mythri movie makers,uppena movie,sukumar  సుకుమార్ చెప్పాడా.. ఇక హిట్టే..!!
News About Mythri Movie Makers UPPENA Movie సుకుమార్ చెప్పాడా.. ఇక హిట్టే..!!
Sponsored links

మైత్రి మూవీస్ అంటే సుకుమార్, సుకుమార్ అంటే మైత్రి మూవీస్ అన్న రేంజ్‌లో వాళ్ళ స్నేహ బంధం కొనసాగుతుంది. అయితే సుకుమార్ కాంపౌండ్ నుండి వచ్చిన బుచ్చిబాబు మెగా హీరో వైష్ణవ్ తేజ్‌తో మైత్రి మూవీస్ బ్యానర్‌లో ‘ఉప్పెన’ సినిమా చేస్తున్నాడు. వైష్ణవ తేజ్ హీరోగా.. తమిళ నటుడు విజయ్ సేతుపతి విలన్ గా 25 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే బుచ్చిబాబు మీద నమ్మకంతో.. మైత్రి వారు కొత్త హీరో మీద అంత పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేస్తుంది కేవలం సుకుమార్ వలనే అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్  70 శాతం షూటింగ్ పూర్తయినా..  వీఎఫ్ఎక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. అందుకే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కి కూడా ఎక్కువ స‌మ‌యం పడుతుందట. కాబట్టే ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది.

అయితే ఇప్పటివరకు చిత్రీకరణ జరిగిన రషెస్ ని మైత్రి వారు ప్రత్యేకించి సుకుమార్ ని పిలిచి చూయించారట. మొత్తం రషెస్ చూసిన సుకుమార్ పూర్తి సంతృప్తిని వ్య‌క్తం చెయ్యడమే కాదు..ఒక్క మార్పు కూడా చెప్ప‌లేదట. అంతేకాకుండా సినిమా బాగా వ‌చ్చింద‌ని.... బుచ్చి బాబు కి కావాల్సినంత పూర్తి స్వేచ్ఛ ఇస్తే... ఇంకా బాగా తీస్తాడ‌ని మైత్రి వారికీ సుక్కు చెప్పాడ‌ట‌. మరి సుకుమార్ ఉప్పెన రషెస్ చూసి సూపర్ అన్నాడంటే ఆ సినిమా హిట్ అంటున్నారు మైత్రి వారు. ఎందుకంటే నిన్నగాక మొన్న విడుదలైన మైత్రిమూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన మత్తువదలరా సినిమాని కూడా ముందుగా అంటే విడుదలకు నెల ముందే సుక్కు ని పిలిచి మత్తువదలరా సినిమా షో వేసారట. ఇక సుకుమార్ మత్తువదలరా సినిమా చూసు సూపర్.... ఈ సినిమా ప్రేక్షకులకు భీభత్సముగా ఎక్కుతుంది అంటూ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం.. ఆ సినిమా విడుదలై హిట్ అవడంతో.. ఇప్పుడు ఉప్పెన కూడా చూసి సుక్కు బావుంది అని చెప్పడంతో.. ఉప్పెన హిట్ అని మైత్రి వారు ఫిక్స్ అవుతున్నారు.

Sponsored links

News About Mythri Movie Makers UPPENA Movie:

News About Mythri Movie Makers UPPENA Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019