Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Ala Vaikunthapurramuloo Teaser Released..

AVPL టీజర్: సింగిల్ డైలాగ్‌తో సింపేశాడుగా!

‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’ అనే విషయం తెలిసిందే. అల్లు అర్జున్ 19వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ రిలీజై యూ ట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ‘సామజవరగమణ’ సాంగ్ సౌతిండియాలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. అయితే సినిమా రిలీజ్‌ డేట్ జనవరి 12 దగ్గరపడుతుండటంతో మరింత జోరు పెంచి ప్రమోషన్స్‌ను చిత్రబృందం షురూ చేసింది. తాజాగా.. టీజర్‌ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. 

01:24 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్‌లో ప్రధాన పాత్రదారులందర్నీ త్రివిక్రమ్ చూపించేశాడు. ‘మీ నాన్న పెళ్లి కూతుర్ని దాచినట్లు దాచాడు.. సరిగ్గా చూపించలేదు ఎప్పుడూ ముందుకు రా’ అనే మాటతో టీజర్ ప్రారంభమవుతుంది. క్లాస్ లుక్‌, మాస్‌లుక్‌తో అల్లు అర్జున్‌ అదుర్స్ అనిపించాడు. అంటే బన్నీ ‘రఫ్ అండ్ టఫ్‌’గా కనిపించబోతున్నాడన్న మాట. మరోవైపు హీరోయిన్ పూజా మాత్రం హాట్ హాట్‌గా కనిపించింది. మొత్తానికి చూస్తే.. బన్నీ ఈ చిత్రంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కనిపించబోతున్నాడని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. పూజా హెగ్డే బన్నీ పనిచేసే ఆఫీస్ హెడ్‌గా అతనికి లేడీ బాస్ రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలో పూజా గురించి బన్నీ.. ‘మేడం సార్.. మేడం అంతే’ అని చెప్పడం నో.. నో అంటూ బ్యూటీ వేలు చూపించడం మొత్తానికి చూస్తే.. లవ్, కామెడీ, యాక్షన్ సీన్స్‌పై కట్ చేసిన ఈ టీజర్ మెగాభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. కాగా.. ‘వైకుంఠపురం’ అనేది ఇంటి పేరు. ఆ వైకుంఠపురంలోకి అల్లు అర్జున్ అడుగుపెడతాడు. ఆ తర్వాత సముద్రఖనీ ఇంట్లోకి అడుగుపెడతారు.. అయితే ఆయన ఎవరు..? ఆ ఇంటిలోకి అల్లు అర్జున్ ఎందుకు అడుగుపెట్టాడు..? వంటి ఆసక్తికర విషయాలు ప్రశ్నార్థకంగానూ.. లాజికల్‌గానూ ఉన్నాయి.

ఇక ఈ టీజర్ మొత్తానికి సింగిల్ డైలాగ్ మాత్రమే ఉంది. సముద్రఖనీ కారు దిగగా.. ‘మీరు ఇప్పుడే కారు దిగారు.. నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా’ అనే డైలాగ్ సింప్లీ సూపర్బ్ అనిపించింది. ఈ డైలాగ్ విన్న అల్లు ఫ్యాన్స్ బాబోయ్.. సింగిల్ డైలాగ్‌తో సింపేశాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు టీజర్ రిలీజ్ అయిన కాసేపటికే పెద్ద ఎత్తున వ్యూస్ సంపాదించుకుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Click Here For Teaser

Ala Vaikunthapurramuloo Teaser Released..

Ala Vaikunthapurramuloo Teaser Released..
ala vaikunthapurramloo teaser
allu arjun
ala vaikunthapurramloo
avpl teaser review
trvikram srinivas