మళ్లీ ఎన్టీఆర్ కోసం బిగ్‌బాస్ వల!

Sat 07th Dec 2019 04:44 PM
bigg boss 4,ntr,host,telugu  మళ్లీ ఎన్టీఆర్ కోసం బిగ్‌బాస్ వల!
Who is Bigg Boss 4 Host? మళ్లీ ఎన్టీఆర్ కోసం బిగ్‌బాస్ వల!
Sponsored links

బాలీవుడ్ లో బిగ్ బాస్ షోకి సల్మాన్ హోస్ట్ గా దొరికినట్టుగా.. తెలుగులో ఇంకా పక్కాగా ఏ స్టార్ హీరో హోస్ట్ చెయ్యడానికి రెడీ అవడం లేదు. సీజన్ సీజన్ కి హోస్ట్ మారిపోతున్న టాలీవుడ్ బిగ్ బాస్ ఇప్పటికి మూడు సీజన్స్ కి ముగ్గురు హోస్ట్ లు మారారు. ఎన్టీఆర్, నాని, నాగార్జునతో మూడో సీజన్ ముగిసింది. అయితే బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం ఈసారి స్టార్ హీరోని తీసుకుని బిగ్ బాస్ సీజన్ 4 ని స్ట్రాంగ్ గా లీకులు లేకుండా, క్రేజీగా నడపడానికి ఇప్పటినుండే ఏర్పాట్లను మొదలెట్టినట్టుగా ఫిలింనగర్ టాక్. ఎన్టీఆర్ మొదటి సీజన్ ని నడిపించిన తీరుకి బుల్లితెర ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. నాని, నాగ్ బాగానే హ్యాండిల్ చేసినా బిగ్ బాస్ లీకులతో లాస్ట్ రెండు సీజన్స్ కాస్త డల్ అయ్యాయి. ఇక ఎన్టీఆర్ మొదటి సీజన్ తర్వాత రెండో సీజన్ కి ఇంట్రెస్ట్ చూపకపోవడంతో నానిని తీసుకుంటే.. నాని మూడో సీజన్ కి ఇంట్రెస్ట్ చూపించకపోవడం నాగ్ ని తీసుకుంది బిగ్ బాస్ యాజమాన్యం. అయితే ఇప్పుడు నాలుగో సీజన్ కి నాగ్ సుముఖంగా లేరని చెబుతున్నారు.

చివరికి అందరూ మెచ్చిన ఎన్టీఆర్ నే రప్పించాలని నాలుగో సీజన్ కోసం బిగ్ బాస్ యాజమాన్యం ప్రయత్నాలు మొదలెట్టింది. ఎన్టీఆర్ కూడా RRR షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ కి ఫ్రీ అవుతాడని, అందుకే ఎన్టీఆర్ ని పక్కాగా ఈ నాలుగో సీజన్ కి హోస్ట్ గా తెచ్చే ప్రయత్నాలు స్టార్ మా మొదలెట్టింది. ఏం చేసైనా ఎన్టీఆర్ ని తేవాలని స్టార్ మా గట్టిగా అనుకుంటుందట. ఎన్టీఆర్ కి భారీ పారితోషకం ఇవ్వడమే కాకుండా ఇంకా ఇతర ఫెసిలిటీస్ కూడా ఇచ్చి ఎన్టీఆర్ ని పడగొట్టే ప్రయత్నాలు స్టార్ట్ చేసిందట స్టార్ మా. అంతేకాకుండా గత మూడు సీజన్లు ఓ ఎత్తైతే.. ఇప్పుడు నాలుగో సీజన్ ని మరింత భారీగా, వినూత్నంగా ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే బిగ్ బాస్ నిర్వాహకుల వలలో ఎన్టీఆర్ పడాలిగా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.

Sponsored links

Who is Bigg Boss 4 Host?:

Bigg Boss 4: NTR Name in Host Place

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019