పాయల్ పాప ‘మామ’కి హ్యాండిచ్చిందిగా..!!

Fri 06th Dec 2019 08:18 PM
payal rajput,not attended,venky mama,press meet  పాయల్ పాప ‘మామ’కి హ్యాండిచ్చిందిగా..!!
No Payal in Venky Mama Movie Press Meet పాయల్ పాప ‘మామ’కి హ్యాండిచ్చిందిగా..!!
Sponsored links

పాయల్ రాజపుత్ ప్రస్తుతం అవకాశాల వేటలో ఉంది. బోల్డ్ సినిమాలతో బోల్డ్ ముద్ర వేయించుకున్న పాయల్ రాజపుత్ కథ డిమాండ్ చేస్తే ఎలాంటి గ్లామర్ అండ్ బోల్డ్ పాత్రకైనా సిద్ధమని చెప్పడంతో.. పాయల్ దగ్గరికి అలాంటి కథలే వస్తున్నాయి. అయినా మధ్యలో వెంకీమామ, డిస్కో రాజా లాంటి ట్రెడిషనల్ సినిమాలు కూడా ఉన్నాయి. RX 100 హిట్ తో RDX లవ్ సినిమాలో రెచ్చిపోయిన పాయల్ కి ఆ సినిమా కోలుకోలేని దెబ్బ ఏసింది. అయితే ఇప్పుడు బోల్డ్ ముద్ర చెరుపుకోవడానికి ఆరాటపడుతున్న పాయల్ రాజపుత్.. తప్పు చేస్తుందనిపిస్తుంది.

వెంకీమామ లో వెంకటేష్ పక్కన హీరోయిన్ గా పద్దతి గల పాత్ర చేస్తున్న పాయల్ రాజపుత్.. ఈ సినిమాతో పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టాలనే ప్రయత్నంలో ఉంది. అయితే వెంకీమామలో నటిస్తే సరిపోదు, ఆ సినిమా ప్రమోషన్స్ లో పాలు పంచుకోవాలి. కానీ పాయల్ తాజాగా వెంకీమామ గ్రాండ్ ప్రెస్ మీట్ జరిగితే దానికి రాకుండా తప్పించుకుంది. చైతు, రాశి ఖన్నా, వెంకీ ఇలా అంత వచ్చిన పాయల్ కనబడలేదు. కారణాలు తెలియవు కానీ.... పాయల్ కి ఆ ఈవెంట్ కి హాజరవడానికి టైం లేదు అనేంత బిజీ అయితే కాదు. వెంకీమామ ప్రమోషన్స్ లో హడావిడి చేస్తే దర్శకనిర్మాతల దృష్టి ఆమెపై పడుతుంది. అసలే వెంకీమామ సినిమా విడుదల చాలా లేట్ అవ్వడంతో.. ప్రమేషన్స్ అంతే వేగంగా ఉంటాయి. మరి ఇకనుండి జరగబోయే ప్రమోషన్స్ కైనా పాయల్ వెంకీమామ టీంకి హ్యాండ్ ఇవ్వకపోతే ఆమె కెరీర్ బావుంటుంది.

Sponsored links

No Payal in Venky Mama Movie Press Meet:

Payal Rajput Not attended for Venky Mama Press Meet

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019