Advertisement

మంచి సినిమా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు: సుకుమార్

Mon 02nd Dec 2019 05:52 AM
bhavana,madhanam,madhanam trailer,srinivasai,sukumar  మంచి సినిమా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు: సుకుమార్
Cant Fail Good Movie.. : Sukumar మంచి సినిమా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు: సుకుమార్
Advertisement

శ్రీనివాస సాయి హీరోగా భావన రావు హీరోయిన్ గా అజయ్ మణికందన్ దర్శకత్వంలో కాశీ ప్రొడక్షన్స్ పతాకంపై దివ్యప్రసాద్, అశోక్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘మథనం’. రియలిస్టిక్ కథాంశంతో లవ్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఇండియాలో రిలీజ్ అవకుండా ఫస్ట్ టైం యుఎస్‌లో డిసెంబర్ 6న విడుదల కావడం విశేషం.. ఆ తర్వాత ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. కాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మథనం ట్రైలర్‌ని లాంచ్ చేశారు.. ఈ కార్యక్రమంలో సూపర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, హీరో శ్రీనివాస సాయి, హీరోయిన్ భావన రావు, నటులు అజయ్ గోష్, రవి ప్రకాష్, సుభాష్, దువ్వాసి మోహన్, నటి హేమ, నిర్మాత దివ్య ప్రసాద్, దీప, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరామెన్ పిజి విందా, లిరిక్ రైటర్ పూర్ణచారి, తానా ప్రెసిడెంట్ సతీష్ వేముల, సెక్రటరీ రవిపోతుల, చిత్ర నిర్మాత అశోక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ‘అశోక్ ప్రసాద్ ప్యాషన్ ఉన్న ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్. ట్రైలర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. హీరో శ్రీనివాస్ సాయి ఐస్ ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయి. ఈ సినిమా యుఎస్‌లో విడుదల కావడం చాలా హ్యాపీగా ఉంది. నా సినిమా ‘వన్ నేనొక్కడినే’ యు.ఎస్‌లో బాగా ఆడింది. లేకపోతే నా కెరియర్ వేరేలా ఉండేది. కంటెంట్ బాగుంటే యు.. ఎస్ ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారు. ఈ సినిమా రియలిస్టిక్ లవ్ స్టోరీతో వస్తోంది. మంచి సినిమా ఎప్పుడు ఫెయిల్ కాలేదు. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.. నిర్మాతలు దివ్య, అశోక్ ప్రసాద్‌కి పెద్ద సక్సెస్ రావాలి’ అన్నారు.

సూపర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘15 ఏళ్ల క్రితం అశోక్ ఇండస్ట్రీలోనే ఉండేవాడు. అమెరికా వెళ్లి జాబ్ చేస్తూ.. డబ్బులు సంపాదించి ఈ సినిమా తీశాడు. సినిమా అంటే అతనికి పిచ్చి. దాంతోనే తన ఫ్రెండ్‌ని డైరెక్టర్ని చేస్తూ ఒక మంచి సినిమా చేశాడు. కొత్త పాయింట్‌తో ఒక మంచి ప్రయత్నం చేశారు. ఫస్ట్ టైం ఈ చిత్రం యు.ఎస్‌లో రిలీజ్ కావడం విశేషం’ అని అన్నారు.

తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన మాట్లాడుతూ.. ‘యు.ఎస్‌లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐస్ మన తెలుగువారు నవీన్ ఎర్నేని, అనిల్ సుంకర మంచి హిట్ చిత్రాలు తీసి సక్సెస్ ఫుల్ నిర్మాతలు అయ్యారు. వారిలాగే అశోక్ ప్రసాద్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది.. డిసెంబర్ 6న యు.ఎస్‌లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి మా సపోర్ట్ ఉంటుంది. అక్కడ చిత్రం సెలబ్రేషన్స్‌ని ఘనంగా జరపనున్నాం’ అన్నారు.

హీరో శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ.. ‘నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు. అజయ్ మాస్టర్ డాన్స్ ఇనిస్టిట్యూట్‌లో మిర్రర్స్ చూసుకుంటూ ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాను. అప్పట్నుంచి అజయ్ గారితో పరిచయం ఉంది. కథ వినగానే చాలా ఎక్సయిట్ అయ్యాను. మేకప్ లేకుండా నాచురల్‌గా ఈ చిత్రంలో నటించాం. పిజి విందా అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రాన్ని పిక్చరైజ్ చేశారు. అశోక్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.. సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని మా టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం..’ అన్నారు.

దర్శకుడు అజయ్ మణికంధన్ మాట్లాడుతూ.. ‘కేరళలో పుట్టి, చెన్నైలో పెరిగి, హైదరాబాద్ వచ్చి ఇక్కడ సినిమా తీయడం చాలా హ్యాపీగా ఉంది. నిజ జీవితంలో జరిగిన ఒక విషయాన్ని ఇన్‌స్పైర్ అయి కథ రాశాను. అశోక్, దివ్యలకు స్టోరీ చెప్పాను. వారికి బాగా నచ్చింది. అప్పట్నుంచి వారిని వదలకుండా సినిమా పూర్తి చేశాను. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. అందరం కలిసి జెన్యున్‌గా మంచి సినిమా చేశాం...’ అన్నారు.

నిర్మాత అశోక్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘అజయ్ ఆరేళ్లుగా ఈ కథపై వర్క్ చేశాడు. డిసెంబర్ 6న మథనం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. తెలుగు సినిమా హిస్టరిలో తొలిసారిగా మా సినిమాని ఇండియాలో రిలీజ్ చేయకుండా యు.ఎస్ లో విడుదల చేస్తున్నాం. ఆ తర్వాత తెలుగు రిలీజ్ ఇండియాలో ప్లాన్ చేస్తాం.. కోటగిరి చంటి గారి ఎడిటింగ్, పిజి విందా కెమెరా విజువల్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్‌గా నిలుస్తాయి. హీరో శ్రీనివాస్, హీరోయిన్ భావన రావ్ పోటా పోటీగా నటించారు. బడ్జెట్‌కి వెనకాడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించాం’ అన్నారు.

Cant Fail Good Movie.. : Sukumar:

Cant Fail Good Movie.. : Sukumar

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement