‘రాజావారు రాణిగారు’కి సుక్కు సపోర్ట్

Tue 19th Nov 2019 10:16 PM
director,sukumar,rajavaru ranigaru,movie,trailer,launch  ‘రాజావారు రాణిగారు’కి సుక్కు సపోర్ట్
Director Sukumar Launches Rajavaru Ranigaru Movie Trailer ‘రాజావారు రాణిగారు’కి సుక్కు సపోర్ట్
Sponsored links

సుకుమార్ చేతుల మీదుగా ది మోస్ట్ అవైటెడ్ ఎంటర్టైనర్ ‘రాజావారు రాణిగారు’ ట్రైలర్ విడుదల

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘రాజావారు రాణిగారు’. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకంపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్  సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. కంటెంట్ ఉన్న సినిమాలకి కేరాఫ్ అడ్రస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. సందీప్ కిషన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి టీమ్ ని విష్ చేశారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా

సుకుమార్ మాట్లాడుతూ... ఈ టీజర్ చూడగానే కాల్ చేశాను. కుర్రాడి వయసు 25 ఇయర్స్ కూడా ఉండవు. ఫస్ట్ టైం డైరెక్టర్ కి మ్యూజిక్ మీద విజువల్స్ మీద కమాండ్ ఉండడం చాలా గొప్పగా అనిపించింది. అందరూ కుర్రాళ్ళు బాగా కష్టపడ్డారు. ఎవ్వరికీ ఎక్సపీరియెన్స్ లేదు. ఆర్య టీమ్ లో ఉన్న అందరూ దాదాపుగా డైరెక్టర్స్ అయ్యారు. కథ చెప్పడంలో ఎంత క్లారిటీగా ఉన్నారో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్న. డైరెక్టర్ కి మంచి భవిష్యత్ ఉంది. పెద్ద డైరెక్టర్ అవుతాడు. మ్యూజిక్ చాలా బాగుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. హీరో హీరోయిన్ నిర్మాతలకు ఆల్ ద బెస్ట్. కిట్టయ్య నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. టోటల్ టీంకి ఆల్ ద బెస్ట్.

చిత్ర దర్శకుడు రవికిరణ్‌ కోలా మాట్లాడుతూ.. పల్లెటూరిలో పుట్టి పెరిగిన వాళ్ళకు తమ జ్ఞాపకాల్ని గుర్తు చేసే చిత్రమిది. పట్నంలో ఉన్నవాళ్లకు పల్లెటూరు ఎలా వుంటుందో రెండుగంటల్లో కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించే చిత్రమిది. సినిమా ప్రివ్యూ చూసిన అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. సుకుమార్ గారికి చాలా థాంక్స్.  అని అన్నారు.

హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ... మా సినిమాను సుకుమార్ గారు సపోర్ట్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా ప్రివ్యూకు అద్భుతమైన స్పందన వచ్చింది. హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈనెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం.

దర్శకుడు రవి ఎంటర్టైన్మెంట్ ని ఎమోషన్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేసాడు. అని అన్నారు.

దర్శకుడు... రవి కిరణ్ కోల

మ్యూజిక్ .. జయ్ క్రిష్

ప్రొడ్యూసర్స్.. మనోవికాస్.డి , మీడియా 9 మనోజ్

Sponsored links

Director Sukumar Launches Rajavaru Ranigaru Movie Trailer:

Rajavaru Ranigaru Movie Trailer Released

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019