Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pressure Cooker Movie Release Date Fixed

‘ప్రెష‌ర్ కుక్క‌ర్’ పని మొదలయ్యేది ఎప్పుడంటే?

ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 6న ‘ప్రెష‌ర్ కుక్క‌ర్’ గ్రాండ్ రిలీజ్‌

సాయి రోన‌క్‌, ప్రీతి అర్సాని హీరో హీరోయిన్లుగా సుజోయ్‌, సుశీల్ ద‌ర్శ‌క ద్వ‌యం తెర‌కెక్కిస్తోన్న చిత్రం ‘ప్రెష‌ర్ కుక్క‌ర్’. క‌రంపురి క్రియేష‌న్స్‌, మైక్ మూవీస్ ప‌తాకాల‌పై  సుజోయ్‌, సుశీల్‌, అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 6న‌ ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ ‘అభిషేక్ పిక్చ‌ర్స్‌’ అభిషేక్ నామా విడుద‌ల చేస్తున్నారు.

ఇటీవ‌ల ఈ సినిమా క‌థ న‌చ్చ‌డంతో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఈ సినిమా టీజ‌ర్‌ను క‌ట్ చేసి రిలీజ్ చేశారు. ఆ టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సునీల్ క‌శ్య‌ప్‌, రాహుల్ సిప్లిగంజ్‌, స్మ‌ర‌ణ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా న‌గేష్ బానెల్‌, అనిత్ మ‌డాడి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

న‌టీన‌టులు:

సాయిరోన‌క్‌, ప్రీతి అస్రాని, రాహుల్ రామ‌కృష్ణ‌, రజ‌య్ రోవాన్‌, తనికెళ్ల భ‌ర‌ణి, సీవీఎల్ న‌ర‌సింహారావు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  సుజోయ్‌, సుశీల్‌

నిర్మాత‌లు:  సుశీల్‌, సుజోయ్‌, అప్పిరెడ్డి

సినిమాటోగ్ర‌పీ:  న‌గేష్ బానెల్‌, అనిత్ మ‌డాడి

సంగీతం:  సునీల్ క‌శ్య‌ప్‌, రాహుల్ సిప్లిగంజ్‌, స్మ‌ర‌ణ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌

బీజీఎం:  హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌

ఎడిట‌ర్‌:  న‌రేష్ రెడ్డి జొన్న‌

పి.ఆర్‌.ఒ:  వంశీశేఖ‌ర్‌

Pressure Cooker Movie Release on Dec 6th

Pressure Cooker Movie Release Date Fixed
pressure cooker
movie
release
december 6