‘అల వైకుంఠపురములో’.. మరో కథ వచ్చింది

Thu 14th Nov 2019 07:26 PM
ala vaikunthapurramloo,allu arjun,story,gossips  ‘అల వైకుంఠపురములో’.. మరో కథ వచ్చింది
One More Story on Ala Vaikunthapurramloo ‘అల వైకుంఠపురములో’.. మరో కథ వచ్చింది
Sponsored links

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబోలో ముచ్చటగా మూడో సినిమాగా అల వైకుంఠపురములో సినిమా తెరకెక్కుతుంది. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇక థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అనేలా ఉంది. ఇప్పటికే రెండు పాటలు ప్రేక్షకుల చెవుల్లో మార్మోగిపోతున్నాయి. అయితే అన్ని అంచనాలున్న ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో రకరకాల కథలు ప్రచారం లోకి వచ్చాయి. అల్లు అర్జున్ అక్కగా టబు నటిస్తుందని... ఆమె గొప్పింటి కోడలుగా ఉంటే ఆమెని కాపాడే సంరక్షకుడిగా అల్లు అర్జున్ ఉంటాడని అన్నారు. తాజాగా పూజ హెగ్డే, అల్లు అర్జున్ కి కోపిష్టి బాస్ గా నటిస్తుందని అన్నారు.

తాజాగా అల వైకుంఠపురములో కథ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినబడుతుంది. అదేమిటంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న అక్కినేని హీరో సుశాంత్, అల్లు అర్జున్ లపై ఈ స్టోరీ ఉంది. ఓ కలవారి కుటుంబం, వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ కుటుంబం చాలా సన్నిహితంగా ఉంటారని, డ్రైవర్ కుటుంబంలో, కలవారి కుటుంబంలో ఒకేసారి మగ బిడ్డలు పుట్టగా.. అనుకోని పరిస్తితుల్లో డ్రైవర్ కొడుకు కలవారి వారసుడిగా, కలవారి వారసుడు డ్రైవర్ కొడుకుగా పెరగాల్సి వస్తుందని, అలా డ్రైవర్ కొడుకు పాత్ర సుశాంత్ పోషిస్తుంటే.. కలవారి వారసుడి పాత్ర లో అల్లు అర్జున్ నటిస్తున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్స్, సుశాంత్ లుక్స్ చూసాక పైన చెప్పిన కథకు కనెక్ట్ అవుతుండడంతో.... అల వైకుంఠపురములో కథ ఇదే అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. 

Sponsored links

One More Story on Ala Vaikunthapurramloo:

Gossips on Ala Vaikunthapurramloo movie Story

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019