‘ఎర్ర‌చీర’ మూవీ నుంచి శివుడి సాంగ్ విడుదల

Tue 12th Nov 2019 10:16 PM
karthika pournami special,siva siva shambo song,erra cheera movie  ‘ఎర్ర‌చీర’ మూవీ నుంచి శివుడి సాంగ్ విడుదల
Song on lord Shiva in Erra Cheera Movie Released ‘ఎర్ర‌చీర’ మూవీ నుంచి శివుడి సాంగ్ విడుదల
Sponsored links

డిసెంబ‌ర్ 27న వస్తున్న ‘ఎర్ర‌చీర’.. నేడు శివ శివ శంభో శంక‌ర గీతావిష్క‌ర‌ణ‌

సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి ఢ‌మరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్ సుమ‌న్ బాబు స్వీయద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ హర్రర్ చిత్రంలో న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌ధారి. మ‌హాన‌టి ఫేం బేబి సాయి తేజ‌స్విని, సి.హెచ్ సుమన్‌బాబు, కారుణ్య, సంజ‌నా శెట్టి, కమల్‌ కామరాజు, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌లు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. శివ శివ శంభో శంక‌ర అనే పాట కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా నేడు రిలీజైంది. ఈ పాట‌కు ప్ర‌మోద్ సంగీతం అందించ‌గా.. బాల‌వ‌ర్ధ‌న్ సాహిత్యం అందించారు. జె. శ్రీ‌నివాస్ ఆల‌పించారు.

దర్శక నిర్మాత మాట్లాడుతూ.. ‘‘కుటుంబ బాంధవ్యాలకి, అనురాగాలకి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సంపూర్ణ కుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది. కుటుంబ కథే అయినా.. హారర్‌ థ్రిల్లింగ్‌ అంశాల్ని కూడా మేళవించాం. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రమోద్‌ స్వరాలు ప్రధాన బలం. రాజ‌మండ్రి రైలెక్కి చెక్కేస్తారు లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేస్తే అద్భుత స్పంద‌న వ‌చ్చింది. తాజాగా కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా శివ శివ శంక‌ర అనే పాటను విడుద‌ల చేశాం. దీనికి స్పంద‌న బావుంది. డిసెంబ‌ర్ 27న సినిమాని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్‌ చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రంలో ఐదు పాట‌లు వేటిక‌వే ప్ర‌త్యేకంగా అల‌రిస్తాయ‌ని సంగీత ద‌ర్శ‌కుడు ప్ర‌మోద్ తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: ప‌్ర‌మోద్, కెమెరా: చ‌ందు, ఎడిటింగ్: డి.వెంక‌ట్ ప్ర‌భు, ఫైట్స్: న‌ందు, స‌మ‌ర్ప‌ణ‌: బేబి ఢ‌మరి, బ్యాన‌ర్: సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్, ద‌ర్శ‌క‌నిర్మాత‌: సి.హెచ్ సుమ‌న్ బాబు.

Sponsored links

Song on lord Shiva in Erra Cheera Movie Released:

Karthika Pournami Special: Siva Siva Shambo Song Released from Erra Cheera Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019