పరశురామ్.. నీ పట్టేంటి సామీ..!!

Tue 12th Nov 2019 07:39 PM
parasuram,next movie,big stars  పరశురామ్.. నీ పట్టేంటి సామీ..!!
Parasuram wants only Big stars పరశురామ్.. నీ పట్టేంటి సామీ..!!
Sponsored links

ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన గీత గోవిందం సినిమా 100 కోట్ల క్లబ్బుని సెట్ చేసి చిన్న చిత్రం కాస్త బ్లాక్ బస్టర్ రేటింగ్స్ తోనూ కలెక్షన్స్ తోనూ దుమ్ము దులిపింది. ఆ సినిమా డైరెక్టర్ పరశురామ్ ఒక్కసారిగా స్టార్ స్టేటస్ వచ్చేసింది. దానితో పరశురామ్ స్టార్ హీరోలే టార్గెట్ గా సినిమా కథలు ప్రిపేర్ చేసుకున్నాడు. గీత గోవిందం తర్వాత మహేష్ కి ఓ కథ రాసుకుని వినిపించగా మహేష్ తిప్పి తిప్పి పరశురామ్ ని రిజెక్ట్ చేసాడు. మహేష్ తర్వాత హిట్స్ లేకపోయినా... మంచి బ్యాగ్రౌండ్ ఉందని అఖిల్ కి ఓ కథ వినిపించగా అఖిల్ కూడా వద్దన్నాడు. తర్వాత హిట్స్ తో దుమ్మురేపుతున్న నానిని అడిగాడు. నాని కూడా పరశురామ్ తో సినిమా విషయంలో పాజిటివ్ గా ఉన్నప్పటికీ... గ్యాంగ్ లీడర్ దెబ్బకి కొత్త కథ కోసం వెయిట్ చేస్తున్నాడు.

ఇక చివరికి స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న విజయ్ దేవరకొండ కూడా తనకు హిట్ ఇచ్చిన పరశురామ్ ని రిజెక్ట్ చేసాడనే న్యూస్ నడుస్తుంది. పాపం అంత పెద్ద హిట్ ఉన్న ఈ దర్శకుడికి ఒక్క స్టార్ హీరో కూడా అవకాశం ఇవ్వడం లేదు. కాని పరశురామ్ తలచుకుంటే ఓ మీడియం రేంజ్ హీరో దొరక్కమానడు. కానీ పరశురామ్ మాత్రం స్టార్ హీరోనే కావాలని కూర్చోవడంతో.. ఇన్నాళ్లుగా ఖాళీగా ఉండిపోయాడు. ఇప్పటికే అందరూ పరశురామ్ కి స్టార్ హీరోలే కానీ మీడియం హీరోలు ఆనరా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న పరశురామ్ మాత్రం తాను అనుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అంటున్నాడు. 

Sponsored links

Parasuram wants only Big stars:

Gossips on Parasuram next Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019