భారీ చిత్రంలో త్రిషకు బంపరాఫర్..!!

త్రిష.. ఒకప్పుడు టాలీవుడ్‌‌ను ఓ ఊపు ఊపింది.. జూనియర్లు, సీనియర్లు, స్టార్ హీరోలు అనే తేడా లేకుండా అందరి సరసన నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇలా చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్టవ్వడంతో ఒకానొక సందర్భంలో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌ రేంజ్‌కు వెళ్లింది. అయితే ఈ ఫేమ్‌ ఎన్నో రోజులు నిలబడలేదు.. త్రిష తర్వాత కొత్త కొత్త నటీమణులు రావడం.. అవకాశాలన్నీ తన్నుకుపోవడంతో టాలీవుడ్‌కు ఈ ముద్దుగుమ్మ టాటా చెప్పేసి కోలీవుడ్‌కే పరిమితమైంది. తమిళ్‌లోనూ మంచి మంచి కథలు ఎంచుకున్న ఈ బ్యూటీ అదే ఫేమ్‌తో ముందుకెళ్తోంది.

ఇక అసలు విషయానికొస్తే.. దక్షిణాది ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించాలని మణిరత్నం నుంచి త్రిషకు పిలుపొచ్చిందని సమాచారం. మణిరత్నం సినిమా కావడం.. అందులోనూ కీలక పాత్ర కావడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ భామ ఒప్పేసుకుందట. అంటే త్రిష లక్కీ చాన్స్ కొట్టేసినట్లే మరి. ఈ బంపరాఫర్‌తో త్రిష ఆనందానికి అవధుల్లేవట. కాగా.. ఇప్పటికే అందానికే కేరాఫ్‌గా పేరుగాంచిన ఐశ్వర్యరాయ్, మోహన్‌బాబు, కార్తీ, జయం రవిని మణిరత్నం తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.

Bumper Offer To Trisha!

Bumper Offer To Trisha!
mani ratnam
bumper offer
trisha
ponniyin selvan