పరమానందయ్య శిష్యుల కథ 3డి టీజర్ విడుదల

Paramanandayya Sishyula Katha 3D Teaser Released

Sun 20th Oct 2019 09:18 PM
Advertisement
sri paramanandayya sishyula katha 3d,teaser release,director maruthi,sri paramanandayya sishyula katha movie  పరమానందయ్య శిష్యుల కథ 3డి టీజర్ విడుదల
Paramanandayya Sishyula Katha 3D Teaser Released పరమానందయ్య శిష్యుల కథ 3డి టీజర్ విడుదల
Advertisement

డైరెక్టర్ మారుతీ విడుదల చేసిన పరమానందయ్య శిష్యుల కథ 3డి టీజర్ 

అలనాటి పరమానందయ్య శిష్యుల కథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ నేపథ్యంలో పింక్ రోజ్ సినిమాస్ పతాకంపై కాటంరెడ్డి సంతన్ రెడ్డి, సిహెచ్ కిరణ్ శర్మ నిర్మాతలుగా వెంకట రాజేష్ పులి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీ పరమానందయ్య శిష్యుల కథ 3డి. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారిగా చిన్నారుల కోసం 3డి ఫార్మాట్ లో తెరకెక్కిన సినిమాగా శ్రీ పరమానందయ్య శిష్యుల కథ 3డి విడుదలకు సిద్ధం అవుతుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్‌ని డైనమిక్ డైరెక్టర్ మారుతీ విడుదల చేశారు. 

ఈ సందర్బంగా మారుతీ మాట్లాడుతూ చిన్నారుల కోసం, పిల్లలకు నచ్చేలా ఇప్పుడున్న టెక్నాలజీ వాడుకొని మనందరికీ తెలిసిన పరమానందయ్య శిష్యుల కథను కొత్తగా చూపించే ప్రయత్నం చేసినందుకు ఈ చిత్ర బృందానికి నా అభినందనలు తెలుపుతున్నాను. పిల్లలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన మరిన్ని విషయాలు తెలుపుతామని నిర్మాతలు చెప్పారు.

చిన్నారుల కోసం తీసిన తొలి తెలుగు 3డి చిత్రం 

పరమానందయ్య శిష్యుల కథలో ఉన్న నీతిని చిన్నారులకు మరింతగా చేరవేయడం కోసం ఈ చిత్రాన్ని 3డి లో రెడీ చేశారు. ఇక అలానే ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే రీతిన కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. 

బ్యానర్: పింక్ రోజ్ సినిమాస్ 

నిర్మాతలు: కాటంరెడ్డి సంతన్ రెడ్డి, సి హెచ్ కిరణ్ శర్మ

దర్సకత్వం: వెంకట రాజేష్ పులి

ఛాయాగ్రహణం: జి. ప్రభాకర్ రెడ్డి 

కూర్పు: కార్తీక్ శ్రీనివాస్ 

సంగీతం: యాజమాన్య

Advertisement

Paramanandayya Sishyula Katha 3D Teaser Released:

Director Maruthi Releases Paramanandayya Sishyula Katha 3D Movie Teaser

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement