Advertisementt

‘రొమాంటిక్’ చిత్రంలో శివగామిదేవి

Wed 16th Oct 2019 06:14 PM
ramya krishna,akash puri,romantic,sivagami,puri jagannadh,charmi  ‘రొమాంటిక్’ చిత్రంలో శివగామిదేవి
Ramya Krishna key role in Romantic Movie ‘రొమాంటిక్’ చిత్రంలో శివగామిదేవి
Advertisement
Ads by CJ

‘రొమాంటిక్’ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్న‌ ర‌మ్య‌కృష్ణ‌

ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ పతాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంక‌ర్’ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత పూరి, ఛార్మి నిర్మిస్తున్న చిత్ర‌మిది.

‘బాహుబ‌లి’ చిత్రంలో రాజ‌మాత శివ‌గామిదేవీగా న‌టించి సినీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ర‌మ్య‌కృష్ణ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇందులో ర‌మ్య‌కృష్ణ ఫుల్ లెంగ్త్ రోల్‌లో క‌న‌ప‌డ‌నున్నారు. మంగ‌ళ‌వారం నుండి జ‌రుగుతున్న షెడ్యూల్‌లో ర‌మ్య‌కృష్ణ జాయిన్ అయ్యారు. ఇన్‌టెన్స్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్ని అందిస్తున్నారు. న‌రేశ్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

న‌టీన‌టులు:

ఆకాశ్ పూరి, కేతికాశ‌ర్మ‌, ర‌మ్య‌కృష్ణ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే, ఉత్తేజ్‌, సునైన త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: అనిల్ పాదూరి

నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి

స‌మ‌ర్ప‌ణ‌: లావ‌ణ్య‌

సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌

సినిమాటోగ్ర‌ఫీ: న‌రేశ్

ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖి

ఆర్ట్‌: జానీ షేక్‌

పాట‌లు: భాస్క‌ర భ‌ట్ల‌

ఫైట్స్‌: రియ‌ల్ స‌తీశ్‌

పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌

Ramya Krishna key role in Romantic Movie:

Ramya Krishnan in Akash Puri’s ‘ROMANTIC’

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ