‘సరిలేరు నీకెవ్వరు’.. పవర్‌పుల్ పోస్టర్ విడుదల

Tue 08th Oct 2019 02:30 PM
vijayadasami,special,mahesh babu,powerful,look,sarileru neekevvaru  ‘సరిలేరు నీకెవ్వరు’.. పవర్‌పుల్ పోస్టర్ విడుదల
Sarileru Neekevvaru Movie Powerful Poster Released ‘సరిలేరు నీకెవ్వరు’.. పవర్‌పుల్ పోస్టర్ విడుదల
Sponsored links

సంక్రాంతి కానుకగా  సూపర్ స్టార్ మహేష్  ‘సరిలేరు నీకెవ్వరు’

సూపర్‌స్టార్‌ మహేష్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంబంధించి న్యూ స్టిల్‌ను దసరా శుభాకాంక్షలతో విడుదల చేశారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. తమిళనాడు, కేరళలో జరిగే ఔట్‌డోర్‌ షెడ్యూల్‌తో నవంబర్‌ నెలాఖరు వరకు ఆల్‌మోస్ట్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్న, ప్రత్యేక పాత్రలో సీనియర్‌ హీరోయిన్‌ విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్‌ నటిస్తున్న ఈ దేవిశ్రీప్రసాద్‌, రత్నవేలు, కిశోర్‌ గరికిపాటి, తమ్మిరాజు, రామ్‌లక్ష్మణ్‌, యుగంధర్‌ టి., ఎస్‌.కృష్ణ సాంకేతిక వర్గం.

Sponsored links

Sarileru Neekevvaru Movie Powerful Poster Released:

VijayaDasami Special: Mahesh Babu in Powerful Look

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019