బండ్ల గణేష్‌కు ఏపీ మంత్రి స్వీట్ వార్నింగ్!?

Tue 17th Sep 2019 08:05 PM
minister botsa satyanarayana,sweat warnig,bandla ganesh  బండ్ల గణేష్‌కు ఏపీ మంత్రి స్వీట్ వార్నింగ్!?
AP Minister Gives Sweat Warnig To Producer Bandla! బండ్ల గణేష్‌కు ఏపీ మంత్రి స్వీట్ వార్నింగ్!?
Sponsored links

టాలీవుడ్ నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్‌కు ఏపీ మంత్రి వార్నింగ్ ఇచ్చారా..? మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే ఊరుకునే ప్రసక్తే లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారా..? సార్ ఇంకోసారి రిపీట్ కానివ్వనని ఆ మంత్రికి బండ్ల సారీ చెప్పారా..? తాజా పరిస్థితులను బట్టి ఇదంతా అక్షరాలా నిజమనిపిస్తోంది.

వాస్తవానికి బండ్ల గణేష్‌కు ఒక్క సినిమా రంగంలోనే కాదు రాజకీయాలు, వ్యాపారంలోనూ మంచి మిత్రులున్నారు.. అలా తన మిత్రబంధంతో కొనసాగిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఇక ఏపీ మంత్రి బొత్సా సత్యనారాయణతో బండ్ల గణేష్‌కు ఎలాంటి సన్నిహిత సంబంధాలున్నాయో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఒకానొక సందర్భంలో బొత్సకు బండ్ల బినామీ అని కూడా వార్తలొచ్చాయి.

ఇటీవల వైఎస్ జగన్ వందరోజులు పూర్తయిన సందర్భంగా తన ట్విట్టర్ వేదికగా బండ్ల స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న మంత్రి బొత్స.. ‘ఇది సబబు కాదు బండ్ల.. నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావ్.. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బాగోదు.. ఇలాంటివి మాట్లాడకుండా ఉంటే నీకే మంచిది’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారట. ప్రస్తుతం ఈ వ్యవహారం టాలీవుడ్‌, ఏపీ రాజకీయాల్లో బాగా చర్చనీయాంశమవుతోంది. ఇది నిజంగానే జరిగిందా..? లేకుంటే పుకారేనా అనేది తెలియాలంటే బండ్ల రియాక్ట్ అవ్వాల్సిందే మరి.

Sponsored links

AP Minister Gives Sweat Warnig To Producer Bandla!:

AP Minister Gives Sweat Warnig To Producer Bandla!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019