పవన్‌పై మళ్లీ పుకార్లు.. ఫ్యాన్స్ అయోమయం!!

Mon 16th Sep 2019 08:58 PM
rumours,pawan kalyan,fans,trivikram,dil raju  పవన్‌పై మళ్లీ పుకార్లు.. ఫ్యాన్స్ అయోమయం!!
Again Rumours On Pawan Kalyan.. !! పవన్‌పై మళ్లీ పుకార్లు.. ఫ్యాన్స్ అయోమయం!!
Sponsored links

బాబోయ్.. నేను సినిమాలు చేయను.. చేయనుగాక చేయను.. ఇక ప్రజల కోసమే నా జీవితం అంకితం.. అని పదే పదే చెప్పినా పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌పై ‘రీల్’ రూమర్స్ మాత్రం అస్సలు ఆగట్లేదు. అయితే ఇప్పటి వరకూ వచ్చిన పవన్‌పై వచ్చిన పుకార్లు వేరు.. ఇవి వేరు. తాజాగా వస్తున్న ఈ రూమర్స్ కాస్త నమ్మశక్యంగానే ఉన్నాయి. ఇందుకు కారణం మాటల మాంత్రికుడు తివిక్రమే.

బాలీవుడ్, కోలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్టయిన ‘పింక్’ మూవీ తెలుగు హక్కులను ఇప్పటికే సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు తీసుకునేశారు. వాస్తవానికి మొదట ‘పింక్’కు బాలయ్య అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత పవన్ అయితే బాగుంటుందని.. ఆయనైతే సరిగ్గా సెట్ అవుతారని దిల్‌ రాజు ఫిక్సయిపోయాడట. తనకు ఈ ఆలోచన రాగానే వెంటనే పవన్‌కు ఆప్తమిత్రుడైన త్రివిక్రమ్‌ను కలిసి అసలు విషయం చెప్పాడట. ‘ప్లీజ్ త్రివిక్రమ్.. పవన్‌ను ఒప్పించండి’ అని దిల్ అడిగాడట.

మొత్తం విన్న మాటల మాంత్రికుడు.. పవన్‌తో ఇటీవలే కూర్చుని ‘పింక్’ రీమేక్ గురించి చర్చించాడని టాక్ నడుస్తోంది. అయితే పవన్ ఏమని రిప్లై ఇచ్చాడు..? మిత్రుడి మాటను కాదనలేక ఒప్పేసుకున్నాడా..? లేకుంటే లైట్ తీసుకోమన్నారా..? అనేది ఇంకా తెలియరాలేదు. ఏదేమైనప్పటికీ తాజా రూమర్స్‌ పవన్ అభిమానులు, మెగాభిమానులు, జనసేన కార్యకర్తలను మరోసారి అయోమయంలోకి నెట్టాయి.

Sponsored links

Again Rumours On Pawan Kalyan.. !!:

Again Rumours On Pawan Kalyan.. !!  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019