ప్రభాస్‌ అంటే ఇష్టం.. ఆయనలో ఏదో ఉంది!

Thu 12th Sep 2019 09:06 AM
prabhas,payal rajput,interesting comments,rx-100 beauty  ప్రభాస్‌ అంటే ఇష్టం.. ఆయనలో ఏదో ఉంది!
Payal rajput interesting Comments Hero Prabhas ప్రభాస్‌ అంటే ఇష్టం.. ఆయనలో ఏదో ఉంది!
Sponsored links

యంగ్ రెబల్ ప్రభాస్ అంటే తనకిష్టమని.. ఆయనలో ఏదో తెలియనిది ఉందని.. ఆయనతో కలిసి నటించాలని ఉందని హీరోయిన్ చెబుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా..? అదేనండి ఆర్ఎక్స్-100 సినిమాలో తన అందాలను ఆరబోసి కుర్రకారుకు నిద్రలేకుండా చేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. 

ఆర్ఎక్స్ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా.. ‘డిస్కోరాజా’, ‘ఆర్డీఎక్స్ లవ్’, ‘వెంకీమామ’లో నటించిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు సినిమాల్లో అవకాశం దక్కించుకోవడం ఆషామాషీ విషయమేమీ కాదు. ఆర్ఎక్స్ సినిమాలో మాదిరిగానే ఈ మూడు సినిమాల్లోనూ భారీగానే అందాలు ఆరబోసిందీ భామ. ‘ఆర్డీఎక్స్ లవ్’ ప్రమోషన్‌లో భాగంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ప్రభాస్ .. విజయ్ దేవరకొండలలో మీకు ఎవరు ఎక్కువ హాట్‌గా అనిపిస్తారు’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు పాయల్ చాలా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 

తనకు రెబల్ స్టార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టమని..  నిజంగా ఆయనలో ఏదో స్పార్క్ వుందని చెప్పుకొచ్చింది. అంతటి ఆగని ఈ హాట్ భామ డార్లింగ్ బాడీ లాంగ్వేజ్ .. సహజంగా అనిపించే స్టైల్ అంటే మరింత ఇష్టమని.. అవకాశం వస్తే ప్రభాస్‌తో కలిసి నటించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టింది. అయితే ఈ భామకు ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం లేదో వేచి చూడాలి మరి.

Sponsored links

Payal rajput interesting Comments Hero Prabhas:

Payal rajput interesting Comments Hero Prabhas  

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019