ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Why Poonam Kaur Didn’t Get Cinema Chance

ఈ భామ ఎంత ఆరబోసినా అవకాశాలు రాలేదే!

సినిమాల్లోకి కొత్తగా వచ్చినప్పుడు ఇక నటీమణులకు హవా మామూలుగా ఉండదు. ఇదంతా కొన్ని రోజులు అంటే.. ఒకట్రెండు సినిమాల వరకు పరిమితం అవుతుంది. అప్పుడంతా దర్శక నిర్మాతలు సదరు నటీమణుల కోసం తెగ తిరగేస్తుంటారు. అయితే కాసిన్ని సినిమాలు తీశాక అప్పుడిక అవకాశాల కోసం నటీమణులు వేచి చూడాల్సి ఉంటుంది. అలాంటి వారిలో పూనమ్ కౌర్ కూడా ఒకరన్న విషయం తెలిసిందే.

టాలీవుడ్‌ పదేసి సినిమాలు చేసిన ఈ భామ ఆ తర్వాత అడ్రస్ గల్లంతయ్యింది. అయితే ఇప్పుడు కాస్తో కూస్తో బుల్లితెరకు పరిమితమై అక్కడ రాణిస్తోంది. ఇక సినిమాల్లో అవకాశాలు మాత్రం దాదాపు లేనట్లేనని ఫిక్స్ అయిన ఈ భామ బుల్లితెర వైపుకు అడుగులేసింది. అయితే.. గ్యాప్ దొరికితే చాలు మాంచి హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతోందీ భామ.

అయితే నేనున్నా.. అని గుర్తు తెచ్చేందుకు ఇలా చేస్తోందో.. లేకుంటే ఇలాగైనా సినిమాల్లో అవకాశాలు వస్తాయని పూనం చేస్తోందో ఆమెకు తెలియాలి మరి. నెట్టింట్లో ఆమె హాట్ హాట్ ఫొటోలు చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. ఇక హీరోయిన్‌గా ఎలా అవ్వదులే కానీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గడిపేయండి అంటూ సినీ జనాలు ఉచిత సలహాలు ఇస్తున్నారు.

Why Poonam Kaur Didn’t Get Cinema Chance

Why Poonam Kaur Didn't Get Cinema Chance
poonam kaur
cinema chance
serials
hot photos