ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Darpanam Censor Completed.. Ready to Release

‘దర్పణం’ సెన్సార్‌ పూర్తి.. విడుదలకు రెడీ!

సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న  క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దర్పణం’. సెప్టెంబర్‌ 6న విడుదల. 

తనిష్క్‌రెడ్డి, ఎలక్సియస్‌ జంటగా రామకృష్ణ  వెంప దర్శకత్వంలో శ్రీనంద ఆర్ట్స్‌ పతాకంపై క్రాంతి కిరణ్‌ వెల్లంకి నిర్మిస్తున్న క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దర్పణం’.. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌ కి విశేష స్పందన లభించగా.. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని సెప్టెంబర్‌ 6న  గ్రాండ్ గా విడుదలకానుంది.

ఈ సందర్భంగా ..... చిత్ర దర్శకుడు రామకృష్ణ వెంప మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో థ్రిల్లర్‌ జోనర్‌లో వచ్చిన అన్ని సినిమాలు విజయం సాధించాయి. అదే తరహాలో క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం దర్పణం. లాస్ట్‌ మినిట్‌ వరకు ఏం జరుగుతుందా? అని సస్పెన్స్‌ని క్రియేట్‌ చేస్తూ ఆద్యంతం అలరిస్తుంది. ప్రొడ్యూసర్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా సినిమాని నిర్మించారు ఆయన సహకారం మర్చిపోలేనిది. తప్పకుండా ఈ సినిమా అందరిని అలరిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. 

నిర్మాత క్రాంతి కిరణ్‌ వెల్లంకి మాట్లాడుతూ.... చాలా కష్టపడి ఇష్టపడి సినిమా చేశాము. దర్శకుడు రామకృష్ణ మేకింగ్‌ ఈ చిత్రానికి మంచి అసెట్‌ అవుతుంది. అందరు సపోర్ట్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను. రీసెంట్‌గా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికేట్‌ పొందింది. సెప్టెంబర్‌6 న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటివరకు వచ్చిన థ్రిల్లర్‌ సినిమాలకు మించి ఈ సినిమాలో మంచి కంటెంట్‌ ఉంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన టీజర్‌, ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తోంది. సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అన్నారు. 

కెమెరామెన్‌: సతీష్‌ముత్యాల, ఎడిటర్‌: సత్యగిడుతూరి, మ్యూజిక్‌ డైరెక్టర్‌: సిద్దార్ధ్‌ సదాశివుని, ప్రొడ్యూసర్‌: క్రాంతి కిరణ్‌ వెల్లంకి, డైరెక్టర్‌: రామకృష్ణ వెంప.

Darpanam Release on Sep 06

Darpanam Censor Completed.. Ready to Release
darpanam
censor
completed
release
sep 6
Advertisement
Advertisement