Advertisement

‘రణరంగం’లోని ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ పాటొచ్చింది

Mon 29th Jul 2019 09:33 PM
sharwanand,kajal agarwal,ranarangam movie,third song,launched  ‘రణరంగం’లోని ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ పాటొచ్చింది
Ranarangam Third song Pilla Picture Perfect Video Launched ‘రణరంగం’లోని ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ పాటొచ్చింది
Advertisement

‘శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శిని’ ల కాంబినేషన్‌లో సుధీర్ వర్మ దర్శకత్వంలో  సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం ‘రణరంగం’  లోని 8పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’  పాట విడుదల 

యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శినిల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’ ఆగస్టు 15 న విడుదల కానున్న విషయం విదితమే.

ఈ చిత్రానికి సంబంధించిన మూడవ గీతాన్ని ఈ రోజు విడుదల చేశారు. ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ అనే పల్లవి గల ఈ గీతాన్ని గీత రచయిత కృష్ణ చైతన్య రచించగా, సంగీత దర్శకుడు సన్నీ ఎం.ఆర్. సమకూర్చిన స్వరాలు అలరిస్తాయి. కథానాయకుడు శర్వానంద్, కాజల్ అగర్వాల్ లపై ఈ గీతాన్ని చిత్రీకరించారు. కథ పరంగా శర్వానంద్, కాజల్ అగర్వాల్ ల మధ్య  చిత్రీకరించిన ఈ పాట క్లాస్, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గాయని నిఖిత గాంధీ గళం ఈ పాటకు మరింత కొత్తదనాన్ని అందించింది. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 15, 2019 న విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. 

ఈ చిత్రానికి మాటలు: అర్జున్ - కార్తీక్, సంగీతం : ప్రశాంత్ పిళ్ళై , ఛాయాగ్రహణం :దివాకర్ మణి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ చైతన్య,ఎడిటర్: నవీన్ నూలి,  ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, పోరాటాలు:వెంకట్, నృత్యాలు: బృంద, శోభి,శేఖర్, ప్రొడక్షన్ కంట్రోలర్: సి.హెచ్. రామకృష్ణారెడ్డి.

సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ 

రచన-దర్శకత్వం: సుధీర్ వర్మ.

Ranarangam Third song Pilla Picture Perfect Video Launched:

Sharwanand and Kajal Agarwal Ranarangam Movie Third Song Launched

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement