‘మెగా హీరోలను వదల..’ అంటున్న అనసూయ!

News About Hot Anchor AnasuyaNews About Hot Anchor Anasuya

టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ అటు వ్యాఖ్యతగా.. ఇటు సినిమాల్లోను మంచి మంచి పాత్రలతో నటిస్తూ మెప్పిస్తోంది. మరీ ముఖ్యంగా మెగా హీరోల సినిమాల అవకాశమొస్తే చాలు.. ఈ అమ్మడికి ఇక ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. ఇప్పటికే ‘రంగస్థలం’, ‘ఎఫ్-2’తో పాటు పలు చిత్రాల్లో నటించిన ఈ భామ పాత్రకు తగిన న్యాయం చేసి అందరి ప్రశంసలు అందుకుంది. మెగా హీరోలయితే చాలు ఎలాంటి పాత్ర అయినా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది ఈ భామ.

ఇన్ని రోజులు జూనియర్ మెగా హీరోలతో నటించిన ఈ హాట్ యాంకర్ ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చాన్స్ కొట్టేసిందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పుకార్లు టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున వస్తున్నాయి. కొర‌టాల శివ-చిరు కాంబోలో ఆగస్టు-22న మూవీ షూటింగ్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో అన‌సూయ ఓ కీల‌క పాత్రలో న‌టించ‌నుంద‌ట. ప‌ట్టుబ‌ట్టి మ‌రి ప్రత్యేకంగా అన‌సూయ కోస‌మే కొర‌టాల ఈ పాత్ర సిద్ధం చేసినట్లు సమాచారం.

సో.. ఇదే నిజమైతే టాలీవుడ్‌లో ఇప్పటికే అక్కినేని నాగార్జున, విక్టరీ వెంక‌టేష్ సరసన నటించగా.. చిరంజీవితో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంద‌న్న మాట. అంతేకాదండోయ్.. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో త్వరలో సినిమా రానుంది. ఈ చిత్రంలో కూడా అన‌సూయకు కీల‌క పాత్ర ఉంటుందని సమాచారం. ఈ రెండు వార్తలు నిజమైతే మాత్రం అనసూయ ఆనందానికి అవధులుండవేమో. మొత్తానికి చూస్తే ‘మెగా హీరోలను వదల’ .. వదిలే ప్రసక్తే లేదని ఈ బ్యూటీ ఫిక్స్ అయిపోయినట్లుంది. ఈ పుకార్లు నిజమవుతాయో లేకుంటే.. పుకార్లుగానే మిగిలిపోతాయో వేచి చూడాల్సిందే మరి.

News About Hot Anchor Anasuya

lucky chances
mega heros
megastar chiranjeevi
hot anchor anasuya