మరో వినూత్నపాత్రలో వెంకీ..!

Sat 15th Jun 2019 08:51 PM
venkatesh,tarun bhasker,director,venki mama  మరో వినూత్నపాత్రలో వెంకీ..!
Again Venky in Different Role మరో వినూత్నపాత్రలో వెంకీ..!
Sponsored links

ఇటీవల గురు తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న విక్టరీ వెంకటేష్‌ ఎఫ్‌2 చిత్రంతో తన సత్తా ఏంటో మరలా నిరూపించాడు. ప్రస్తుతం ఆయన బాబి దర్శకత్వంలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామా చిత్రం చేస్తున్నాడు. నిజజీవితంలోలాగనే ఇందులో కూడా వెంకీ, చైతన్యలు మామా అల్లుళ్లుగా నటించనున్నారని సమాచారం. 

ఇందులో నాగచైతన్య మిలటరీ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తుండగా, వెంకీ తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకునే మోడ్రన్‌ రైతు పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. దీని తర్వాత బాలీవుడ్‌లో వచ్చిన దే దే ప్యార్‌ దే రీమేక్‌లో కూడా వెంకీ నటించనున్నాడని సమాచారం. ఇవి గాక పెళ్లిచూపులు ఫేమ్‌ తరుణ్‌భాస్కర్‌ దర్శకత్వంలో వెంకీ మరో చిత్రం చేయనున్నాడు. 

ఇది స్పోర్ట్స్‌డ్రామాగా, కార్‌ రేసింగ్‌ల నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఇలాంటి వెరైటీ స్టోరీని తరుణ్‌భాస్కర్‌ వెంకీ కోసం తయారు చేశాడు. నిజానికి వెంకీకి స్పోర్ట్స్‌డ్రామాలలో నటించడం ఇదే మొదటిసారి కాదు. గురులో వయసు మళ్లిన బాక్సింగ్‌కోచ్‌గా కనిపించి మెప్పించాడు. ఇప్పుడు తరుణ్‌భాస్కర్‌ చిత్రంలో స్పోర్ట్స్‌మెన్‌గా, కారు రేసర్‌గా కనిపించనుండటం విశేషం.

Sponsored links

Again Venky in Different Role:

Venkatesh in Tarun Bhasker Direction 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019