Advertisementt

నితిన్ 'భీష్మ' మొదలైంది!!

Thu 13th Jun 2019 05:05 PM
nithin,venky kudumula,bheeshma movie,rashmika  నితిన్ 'భీష్మ' మొదలైంది!!
Bheeshma Movie Opening నితిన్ 'భీష్మ' మొదలైంది!!
Advertisement
Ads by CJ

'భీష్మ'

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న  నూతన చిత్రం 'భీష్మ'  నేటి ఉదయం (12 - 6 - 19 ) 10 : 19 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో  ప్రారంభమయ్యింది.

ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ నెలలో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయని నిర్మాత సూర్యదేవర నాగ వంశి తెలిపారు.

ఈ ప్రో జెక్ట్ గురించి నేను చాలా ఆనందంగా ఉన్నాను అన్నారు చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చినందుకు టీమ్ అంతా చాలా హ్యాపీ గా ఉన్నారు. ప్రతి అబ్బాయి నితిన్ గారి క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చెయ్యబడింది. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. అలాగే చాలా ఫన్ ఎలిమెంట్స్ తో సాగుతుంది అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.

Bheeshma Movie Opening:

Nithin - Venky Kudumula Bheeshma Movie Opening

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ