Advertisementt

‘ప్రేమ‌జంట‌’ వస్తున్నారు

Sat 08th Jun 2019 10:44 PM
prema janta,sumaya,prema janta movie details,censor  ‘ప్రేమ‌జంట‌’ వస్తున్నారు
Prema Janta Censor Completed ‘ప్రేమ‌జంట‌’ వస్తున్నారు
Advertisement
Ads by CJ

సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్, సుమయ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘ప్రేమ‌జంట‌’. స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ద‌గ్గుబాటి వ‌రుణ్ ఈ చిత్రాన్ని జూన్ 28న విడుద‌ల చేస్తున్నారు. మహేష్ మొగుళ్ళూరి నిర్మాత. నిఖిలేష్ తొగరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా రీసెంట్‌గా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ‘యుబైఏ’ స‌ర్టిఫికేట్‌ను పొందింది. 

ఈ సంద‌ర్భంగా నిర్మాత మ‌హేష్ మొగుళ్ళూరి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం. రామ్ ప్రణీత్, సుమయ జోడి క్యూట్‌గా ఉంటుంది. ద‌ర్శ‌కుడు నిఖిలేష్ తొగ‌రి సినిమాను బ్యూటీఫుల్‌గా తెర‌కెక్కించారు. సినిమాలో 5 పాట‌లుంటాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌లైన ఈ పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. కవర్ సాంగ్స్, మరియు టిక్‌టాక్ వీడియోలతో సినిమాపై సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ క్రియేట్ అయ్యింది. సెన్సార్ పూర్తయ్యింది. ‘యుబైఏ’ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. జూన్ 28న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నాం’’ అన్నారు. 

ద‌ర్శ‌కుడు నిఖిలేష్ మాట్లాడుతూ.. ‘‘సినిమా చాలా బాగా వచ్చింది. క్యూట్ ల‌వ్ స్టోరీ. నిర్మాత మ‌హేష్‌గారి స‌హ‌కారంతో సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌గ‌లిగాం. పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ద‌ర్శ‌కత్వంతో పాటు సంగీతం కూడా అందించాను. ఈ చిత్రం హీరో, హీరోయిన్లు రామ్ ప్రణీత్, సుమయలకు తొలి చిత్రమే అయినప్పటికీ ఎంతో నేచురల్‌గా న‌టించారు. హీరోయిన్ సుమయ 2016 మిస్ ఆంధ్ర ప్రదేశ్‌గా సెలెక్ట్ అయింది. సినిమాలో ఎక్కువ భాగం దక్షిణ కాశిగా పేరు పొందిన ఆదిలాబాద్ మరియు ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల్లో చిత్రీక‌రించాం. జూన్ 28న సినిమా విడుద‌ల కానుంది’’ అన్నారు. 

Prema Janta Censor Completed:

Prema Janta Movie Ready to Release

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ