టాప్ హీరోయిన్ అవుతుందనుకుంటే..?

Digangana Suryavanshi Acted Hippi Movie Failed at Box Office

Sat 08th Jun 2019 05:11 PM
digangana suryavanshi,hippi movie,failed,box office  టాప్ హీరోయిన్ అవుతుందనుకుంటే..?
Digangana Suryavanshi Acted Hippi Movie Failed at Box Office టాప్ హీరోయిన్ అవుతుందనుకుంటే..?
Advertisement

హిప్పీ సినిమాలో కార్తికేయకి జోడిగా నటించిన దిగంగన సూర్యవంశీ గురించి హిప్పీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గుండ్రని మొహంతో, మత్తెక్కించే కళ్ళతో, అందమైన శరీరాకృతితో హాట్ యాంగిల్ అయినా తగ్గనని చెప్పే ఆమె వాలకం అన్నీ సమపాళ్లలో రంగరించి కలగలిపిన దేవతలా దిగంగన సూర్యవంశీ ఉందని.. హిప్పీ సినిమా గనక హిట్ అయితే ఈ అమ్మాయి కూడా క్లిక్ అవుతుందని అన్నారు. మరి నిజంగానే చూడగానే ఆకర్షించే అందంతో దిగంగన సూర్యవంశీ ఈ తరం హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చేలా కనబడింది. సినిమా విడుదలకు ముందు హిప్పీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత దిగంగన సూర్యవంశీ టాపిక్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో హాట్ హాట్ గా నడిచింది.

మరి నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిప్పీ సినిమాకి కనీసం మిక్స్డ్ టాక్ కూడా పడలేదు. సినిమాకి ప్లాప్ టాక్ రాగా అందులో కార్తికేయకి జోడిగా నటించిన దిగంగన సూర్యవంశీకి మంచి మార్కులు పడుతున్నాయి. కార్తికేయ క్యారెక్టర్ తో ఆడుకునే అమ్మాయిగా దిగంగన సూర్యవంశీ చక్కని నటనను కనబర్చింది. అందమైన నటన, అందంతో ఆకట్టుకుంది దిగంగన సూర్యవంశీ. కొన్ని యాంగిల్స్ లో అందంగా కనిపించింది. మరి ఈ సినిమా హిట్ అయితే గనక దిగంగన సూర్యవంశీకి మరిన్ని అవకాశాలైతే వచ్చేవి. యంగ్ హీరోల కన్ను దిగంగన సూర్యవంశీ మీద పడేది. కానీ హిప్పీ టాక్ తో దిగంగన సూర్యవంశీ నష్టపోయేలా కనబడుతుంది.

Digangana Suryavanshi Acted Hippi Movie Failed at Box Office:

Heroine Beautiful.. But Movie Flop


Loading..
Loading..
Loading..
advertisement