‘దొరసాని’ ఫస్ట్‌లుక్ అదిరింది

Fri 31st May 2019 05:02 PM
dorasani,first look,launch,details  ‘దొరసాని’ ఫస్ట్‌లుక్ అదిరింది
Dorasani First Look Released ‘దొరసాని’ ఫస్ట్‌లుక్ అదిరింది
Sponsored links

రియలిస్టిక్ అండ్ ఇంటెన్సిటీ ఉన్న కథలకు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. అలాంటి ఓ రియలిస్టిక్ స్టోరీతో వస్తోన్న చిత్రమే ‘దొరసాని’. టైటిల్ కు తగ్గట్టుగానే ఇది తెలంగాణలోని ఓ ప్రాంతంలో 80 దశకంలో జరిగిన కథగా వస్తోంది. లేటెస్ట్ గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ పరిశ్రమ వర్గాల్లోనూ మంచి ఆసక్తిని రేకెత్తించింది. ఆ ఆసక్తిని మరింత పెంచేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది. కథలోంచి పరిచయం అయిన రాజు, దొరసాని చూడ ముచ్చటగా ఉన్నారు. కారులో కూర్చున్న దొరసానిని ఆ పక్కనే సైకిల్ పై వచ్చిన హీరో ఆరాధనగా చూస్తున్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ ఒక రకంగా కథలోని ఆత్మను చెబుతోంది.  రాజు కళ్ళల్లో ప్రేమ, దొరసాని కళ్ళల్లో దర్పం ఈ ప్రేమకథలో వైరుధ్యాన్ని చూపిస్తున్నాయి.

హీరో, హీరోయిన్ల డ్రెస్సింగ్ తో పాటు ఆమె ఉన్న కారును బట్టి కథకు తగ్గట్టుగా నాటి కాలపు వాతావరణాన్ని ఈ చిత్రంలో రీ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం వస్తోన్న రియలిస్టిక్ మూవీస్ లో ఈ చిత్రం ఓ కొత్త తరహాగా నిలువబోతోందని ఈ లుక్ చెప్పకనే చెబుతోంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక హీరో, హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ , బిగ్ బెన్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంతో  కెవిఆర్ మహేంద్ర దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. అలాగే ఈ చిత్ర టీజర్ జూన్ 6 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక జంటగా నటిస్తోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ : సన్ని కూరపాటి, సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి, పిఆర్.వో : జిఎస్.కె మీడియా, నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని, రచన, దర్శకత్వం : కెవిఆర్ మహేంద్ర.

Sponsored links

Dorasani First Look Released:

Dorasani First Look Launch Details

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019