అసలు ఎబిసిడిలో ఏముందని..?

Allu Sirish ABCD Failed at Box OfficeAllu Sirish ABCD Failed at Box Office

మెగా హీరోలందరిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఇక వరుణ్ తేజ్ అయితే యావరేజ్ హిట్స్ కొడుతూ కెరీర్ ని జాగ్రత్తగా మలుచుకుంటున్నాడు. మరో హీరో సాయి ధరమ్ తేజ్ వరస ప్లాప్స్ తర్వాత చిత్రలహరితో యావరేజ్ హిట్ కొట్టాడు. కానీ మరో మెగా హీరో అల్లు శిరీష్ మాత్రం హీరోగా నిలదొక్కుకోవడానికి ఇంకా సతమతమవుతూనే ఉన్నాడు. కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి సినిమాలు అల్లు శిరీష్ కెరీర్ ని నిలబెట్టలేకపోయాయి. మరి ఎలాగైనా హిట్ కొట్టి స్టార్ రేంజ్ కి చేరాలని అనుకుని... ఈసారి సేఫ్ సైడ్ గా ఒక మలయాళీ రీమేక్ ని తెలుగులో కొత్త దర్శకుడితో రీమేక్ చేసాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఎబిసిడి సినిమాని తెలుగులో రీమేక్ చేసాడు. ఆ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ... ఒరిజినల్ వెర్షన్ ని యాజిటీజ్ గా తెరకెక్కించకుండా... దర్శకుడు హీరో అల్లు శిరీష్ కలిసి తెలుగు ప్రేక్షకుల కోసమే కొన్ని సీన్స్ యాడ్ చెయ్యడంతో.. సినిమా షూటింగ్ ఆలస్యమైంది. అలా సినిమా విడుదల లేట్ అయ్యింది. 

అయితే తీరా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎబిసిడి సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులు ఎబిసిడి ఘోరమైన టాక్ ఇస్తే.. క్రిటిక్స్ మాత్రం కాస్త యావరేజ్ మార్కులేశారు. ఎబిసిడి మలయాళ సినిమాని సరిగ్గా అర్ధం చేసుకోకుండా దర్శకుడు తెలుగులో రీమేక్ చేసాడనిపిస్తుంది. కథలో కానీ, కథనంలో కానీ బలం లేకపోవడం, మ్యూజిక్ అంతంత మాత్రంగా ఉండడం, సినిమా కాస్టింగ్ కూడా సినిమాకి మెయిన్ మైనస్, అలాగే నిర్మాణ విలువలు కూడా చీప్ గా అనిపించాయి. 

ఇక సినిమాకు హీరోయిన్ కావాలి కాబట్టి, ఏదో ఒక ట్రాక్ రాయాలి కాబట్టి రాసారు. అంతకు మించి హీరోయిన్ గా చేసిన రుస్కర్ కి ప్రాధాన్యత లేదు. అల్లు శిరీష్ కాస్త బెటర్ పెరఫార్మెన్స్ ఇచ్చాడు తప్ప.. సినిమాలో మరో ప్లస్ పాయింట్ లేదంటే ఎబిసిడి ఫలితమెలా ఉందో చెప్పొచ్చు. మరి రీమేక్ తో హిట్ కొడదామనుకుని అల్లు శిరీష్ చేతులు కాల్చుకున్నట్టే కనబడుతుంది.

ABCD.. One More Flop to Allu Sirish

allu sirish
abcd movie
flop
box office
Bhogi Review
Bhogi Review
27 Nov 2026
O.M Review
O.M Review
27 Nov 2026
Maya Lady Review
Maya Lady Review
27 Nov 2026
DNK Review
DNK Review
27 Nov 2026
GOAT Review
GOAT Review
27 Nov 2026
Scene Review
Scene Review
27 Nov 2026