Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> ISmart Shankar Teaser Review Talk Response

‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్: పూరి అరిపించేసాడుగా!

ప్లాప్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో ప్లాప్ హీరో రామ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఇస్మార్ట్ శంకర్’  సినిమాపై అంచనాలుండవు అనుకుంటే పొరపాటే..... ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్లాప్ లో ఉన్నా పూరి జగన్నాధ్ డైరెక్షన్ మీద ఎక్కడో ఏదో ఒక ఆశ. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో  అంటేనే పక్కా మాస్ మసాలా. అలాగే హీరో కూడా మాంచి వెరైటీ స్టయిల్లో కనిపిస్తాడు. పూరి తీసిన సినిమాలో హీరోల లుక్స్ దీనికి నిదర్శనం. ఎప్పుడు క్లాస్ లుక్ లో మెరిసిపోయే రామ్ ని పూరి తన స్టయిల్లోకి మార్చేశాడు. రామ్ ఇస్మార్ట్ లుక్ ఎప్పుడో ప్రేక్షకులకు ఎక్కేసింది. మరి ఇప్పుడు రామ్ బర్త్ డే కానుకగా విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’ టీజర్ చూస్తుంటే పూరి మళ్ళీ ఫామ్ లోకొచ్చేసినట్లే అనిపిస్తుంది.

‘ఇస్మార్ట్ శంకర్’ లో రామ్ మాట్లాడే తెలంగాణ భాష, బూతు పదాలు, రఫ్ లుక్, మాస్ మసాలా కథ. ఎనేర్జిటిక్ హీరోకి మాస్ డైరెక్టర్ తగిలితే ఎలా ఉంటుందో ఈ టీజర్ లో కనిపిస్తుంది. రామ్ గెట‌ప్ కొత్త‌గా కాదు సరికొత్తగా ఉంది. గెడ్డంతో క‌నిపిస్తున్నాడు. ‘మార్ ముంతా.. ఛోడ్ చింతా’ అంటూ రామ్ చెప్పే డైలాగ్ అదిరింది. రామ్ హిందీ పదాలకు తన శైలి మార్క్ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. 

ఇక ‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడిముంగట పొట్టెల్ని కట్టేసినట్టే’ అంటూ రామ్ చెప్పే మాస్ డైలాగ్ మాస్ ప్రేక్షకులు పడిపోవడం ఖాయం. ముఖ్యంగా గా రామ్ నోట్లో మందు బాటిల్ పెట్టుకుని సాంగ్ లో వేసిన స్టెప్ చాలా బావుంది. మరి టీజర్ మొత్తం రామ్ హీరోయిజంతోనే నింపేసిన పూరి జగన్నాధ్ మార్క్ మేకింగ్ మాత్రం ఈ టీజర్ లో స్పష్టంగా కనబడుతుంది. ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ నటిస్తున్నారు. 

Click Here For ISmart Shankar Teaser

ISmart Shankar Teaser: Kiri Kiri

ISmart Shankar Teaser Review Talk Response
hero ram
ismart shankar
teaser
release